నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఇప్పటివరకూ తెర పంచుకోలేదు. అయితే ఈ ఇద్దరూ స్ర్కీన్ షేర్ చేసుకుంటే చూడాలనే ఆశ నందమూరి అభిమానులకే కాదు... సినీప్రియులకు సైతం ఉంటుంది. కానీ ఇది సాధ్యమవుతుందా అంటే మాత్రం మౌనమే సమాధానం అవుతుంది.
తాజా వార్తల ప్రకారం బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఓ సినిమాని నిర్మించాలని నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇదే కనుక జరిగితే ఈ ప్రాజెక్ట్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూద్దాం మరి... బాబాయ్ బాలయ్యను, తమ్ముడు ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నంలో కళ్యాణ్ రామ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో...?