నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ సినిమాకి 'మోనార్క్' టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ ని కన్ ఫార్మ్ చేయలేదని చిత్రం యూనిట్ కి సంబంధించిన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 'మోనార్క్' టైటిల్ పట్ల నందమూరి అభిమానులతో పాటు చిత్రం యూనిట్ కూడా శాటిస్ ఫైగా లేదట. దాంతో వేరే పవర్ ఫుల్ టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఇదిలా ఉంటే...
అతి త్వరలోనే సినిమా షూటింగ్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ రానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను షూటింగ్ కి సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారట. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.