నందమూరి నటసింహం బాలకృష్ణ ఫస్ట్ టైమ్ ఓ డిజిటల్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్య్వూలో పలు విషయాలను పంచుకున్న బాలయ్య... అబ్బాయ్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన కూడా స్పందించారు.
''ఎన్టీఆర్ కి చిత్రసీమలో మంచి భవిష్యత్తు ఉంది. ఫుల్ టైమ్ రాజకీయాల్లో పాల్గొనాలంటే... డెడికేషన్ ఉండాలి. నాన్నగారు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూనే సినిమాలు చేసారు. నేను సినిమాలు చేస్తున్నాను. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నాను. మాలాగే ఎన్టీఆర్ కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండొచ్చు. అది పూర్తిగా తన ఇష్టం. ఈ విషయంలో ఎవరినీ బలవంతం చేయలేము'' అని చెప్పారు బాలయ్య.