సీనియర్ స్టార్ హీరో నాగార్జునతో ఏషియన్ సినిమాస్ ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున పోలీసాఫీసర్ గా నటించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే తాజా వార్తల ప్రకారం పోలీస్ ఆఫీసర్ పాత్ర కాదట... నాగ్ రైతుగా అలరించనున్నారని తెలుస్తోంది. ఇంతవరకూ నాగ్ చేయని పాత్ర ఇది.
కాగా ఈ సినిమాలో నాగార్జునకు ఓ కూతురు ఉంటుందట. ఆ కూతురు తప్పిపోవడంతో, రైతు అయిన తండ్రి ఎలాంటి సాహసం చేసాడు... తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ సినిమా స్టోరీ అని వార్తలు ప్రచారమవుతున్నాయి. ప్రస్తుతం నాగ్ 'వైల్డ్ డాగ్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోని సినిమాతో బిజీ అయ్యే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.