యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో 'ఆర్ఆర్ఆర్' టెస్ట్ షూట్ చేయడానికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ చేయడానికి రాజమౌళి పక్కాగా ప్లాన్ చేసారట. అయితే ఈ టెస్ట్ షూట్ కి బ్రేక్ పడిందని తెలుస్తోంది.
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో షూటింగ్ చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని రాజమౌళి దగ్గర రాంచరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఇదే మాట చెప్పాడట. దాంతో రాజమౌళి టెస్ట్ షూట్ ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారమ్. కొన్ని రోజులు ఆగాక ఈ టెస్ట్ షూట్ గురించి ఆలోచించాలనుకుంటున్నాడట రాజమౌళి.
ఇటీవల టివి సీరియల్స్ షూటింగ్ ఆరంభమయ్యాయి. అయితే రెండు రోజుల్లోనే ఓ టివి సీరియల్ యూనిట్ లోని నటుడు కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆపేసారు. ప్రస్తుతం టివి సీరియల్స్ షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. మరి మళ్లీ షూటింగ్ లు ఎప్పుడు ఆరంభమవుతాయో వేచిచూడాల్సిందే.