న్యాచులర్ స్టార్ నాని హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 'ట్యాక్సీవాలా' ఫేం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవిని సంప్రదించారనే వార్తలు ఉన్నాయి.
తాజాగా రష్మిక మందన్నాని ఓ హీరోయిన్ గా తీసుకోవడానికి ఈ చిత్రం యూనిట్ ప్రయత్నాలు చేసిందట. అయితే ఈ సినిమాని రష్మిక రిజెక్ట్ చేసిందనేది తాజా సమాచారమ్. ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలీదుకానీ, ఖరాఖండిగా రష్మిక నో చెప్పిందని తెలుస్తోంది. మెయిన్ లీడ్ కోసం సాయిపల్లవిని సంప్రదించడం వల్లే రష్మిక ఈ సినిమాకి నో చెప్పిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటో బయటికి రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే...
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కి కూడా బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ని ఎక్కువ శాతం కోల్ కత్తా లో జరపడానికి ప్లాన్ చేసారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోల్ కత్తా వెళ్లి షూట్ చెయ్యడం కరెక్ట్ కాదని భావిస్తున్న చిత్రం యూనిట్ హైదరాబాద్ లోనే కోల్ కత్తా సెట్ ని నిర్మించాలని భావిస్తోందట. కరోనా వ్యాప్తి కొంచెం తగ్గిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ ఆరంభమయ్యే అవకాశముందని సమాచారమ్.