అక్కినేని కుటుంబానికి బాగా సన్నిహితురాలైన ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి కి కరోనా పాజిటివ్ అనే వార్త బయటికి రాగానే అక్కినేని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే అక్కినేని కోడలు సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డిని ముద్దాడుతూ పెట్టిన ఫోటో దీనికి కారణం. దాంతో నాగచైతన్య, సమంత సేఫేనా అనే అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది.
అయితే శిల్పారెడ్డి కరోనా పాజిటివ్ అన్న విషయం సమంతకు తెలుసట. ఆమె కరోనా నుంచి రికవర్ అయిన తర్వాతే శిల్పారెడ్డిని కలిసిందట సమంత. అప్పుడు తీసుకున్న ఫోటోని షేర్ చేసింది. సో... చైతూ, సామ్ హెల్త్ కి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరంలేదు.
అసలింతకీ శిల్పారెడ్డి కరోనా బారిన పడటానికి కారణం ఎవరో తెలుసా... తన కుటుంబానికి చెందిన వ్యక్తి ద్వారానే శిల్పారెడ్డికి కరోనా సోకిందట. ఆయనకు ట్రావెల్ హిస్టరీ ఉందట. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వగానే శిల్పారెడ్డి, ఆమె భర్త కరోనా టెస్ట్ లు చేయించుకోవడంతోనే వారికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు సమాచారమ్. ఇదన్నమాట అసలు విషయం.
సో.. అక్కినేని ఫ్యాన్స్ డోంట్ వర్రీ... చైతూ, సామ్ సేఫ్...!