రేణుదేశాయ్ రీ ఎంట్రీ కన్ ఫార్మ్ అయ్యిందనే వార్తలు గత మూడు, నాలుగు రోజులుగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్త నిజంకాదని రేణుదేశాయ్ స్ఫష్టం చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నచిత్రం 'మేజర్'. అడవి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రేణుదేశాయ్ కీలక పాత్ర చేయడానికి అంగీకరించిందనే వార్తలు బయటికి వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన రేణుదేశాయ్.. ''ఏదైనా సినిమా కమిట్ అయితే నేనే స్వయంగా రివీల్ చేస్తాను. ఆ వార్తలు నిజంకాదు'' అని చెప్పింది.
రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోందనే వార్త ఆమె అభిమానులను చాలా సంతోషపెట్టింది. అయితే సినిమా కమిట్ అవ్వలేదనే రేణు మాటలు ఆమె ఫ్యాన్స్ ని డిస్పాయింట్ చేసాయి. అసలు రేణుదేశాయ్ మళ్లీ తెరపై కనిపిస్తుందా... ఆమెకు రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన ఉందా అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.