మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా సీనియర్ హీరోయిన్ ని నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్లు అయిన విజయశాంతి, సుహాసిని పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ ఖుష్భూ పేరు తెరపైకి వచ్చింది. ఆల్ రెడీ చిరంజీవి సోదరిగా 'స్టాలిన్' సినిమాలో ఖుష్భూ నటించింది. రెండోసారి చిరు సోదరిగా నటించే అవకాశం ఖుష్భూ దక్కిందని ఫిల్మ్ నగర్ టాక్. ఏ సినిమా కోసం అనే వివరాల్లోకి వెళితే...
మలయాళ చిత్రం 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. 'సాహో' ఫేం సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా మలయాళ వెర్షన్ లో మంజు వారియర్ చేసిన పాత్రను ఖుష్భూతో చేయించాలనుకుంటున్నారట. ఈ ఆఫర్ కి ఖుష్భూ నో చెప్పే అవకాశంలేదు. ఏదేమైనా దీనికి సంబంధించి చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూద్దాం.