స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాకి సంబంధించి ఓ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే..
రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుందట. ఫారెస్ట్ నుంచి రెడ్ శాండిల్ ని తీసుకెళ్లే లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ నటిస్తున్నాడనే వార్తలు ఉన్నాయి. అల్లు అర్జున్ కి ఇద్దరు సోదరులు ఉంటారట. ఓ సోదరుడు గ్రామ సర్పంచ్ అట. సో... 'పుష్ప' సినిమాలో పొలిటికల్ టచ్ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. సుకుమార్ 'రంగస్థలం' చిత్రంలో రాంచరణ్ సోదరుడిగా ఆది పినిశెట్టి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతోనే సినిమా స్టోరీ లైన్ మలుపు తీసుకుంటుంది. 'పుష్ప' సినిమాలో కూడా అల్లు అర్జున్ సర్పంచ్ సోదరుడు పాత్రతోనే స్టోరీలో ట్విస్ట్ ఉంటుందని సమాచారమ్.
మరి ఈ కీలక పాత్ర చేసే నటుడు ఎవరు... ఎవరితో ఈ పాత్ర చేయించడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.