యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా. ఈ సినిమాకి 'పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు ఉన్నాయి. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఎగ్జయిటింగ్ న్యూస్ ప్రచారమవుతోంది. అదేంటంటే...
ఈ సినిమాలోని మెయిన్ విలన్ రోల్ కోసం యంగ్ హీరో మంచు మనోజ్ ని సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలీదుకానీ... ఎన్టీఆర్, మనోజ్ కాంబినేషన్ కుదిరితే మాత్రం ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ ఏర్పడటం ఖాయం. మనోజ్ లో మంచి నటుడు ఉన్నాడు. విలన్ గా విజృంభించగల సత్తా ఉంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకూ సెట్ అవుతుందో వేచిచూద్దాం.