స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాకి సంబంధించి ఓ అప్ డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే..ఈ సినిమాలో అల్లు అర్జున్ కి ఇద్దరు సోదరులు ఉంటారట. ఓ సోదరుడు గ్రామ సర్పంచ్ అట. ఈ పాత్రతోనే స్టోరీలో ట్విస్ట్ ఉంటుందని సమాచారమ్.
కాగా ఈ కీలక పాత్ర కోసం రాంచరణ్ అన్నయ్యను రంగంలోకి దింపుతున్నారట డైరెక్టర్ సుకుమార్. రాంచరణ్ అన్నయ్య ఎవరో ఈపాటికే అర్ధమయ్యుంటుంది కదా... యస్... మీరు గెస్ చేసింది కరెక్టే. ఆది పినిశెట్టిని ఈ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. సుకుమార్ 'రంగస్థలం' చిత్రంలో రాంచరణ్ సోదరుడిగా ఆది పినిశెట్టి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతోనే సినిమా స్టోరీ లైన్ మలుపు తీసుకుంటుంది. 'పుష్ప' సినిమాలో కూడా ఆది పినిశెట్టి పాత్ర చాలా కీలకమట. తన పాత్రతోనే స్టోరీ లైన్ లో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుందని సమాచారమ్.