బ్యాంక్ నేరంతో కీర్తిసురేష్ కి లింకా... అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా... రియల్ లైఫ్ లో కాదండి... రీల్ లైఫ్ లో కీర్తిసురేష్ కి బ్యాంక్ నేరంతో లింక్ ఉంది. విషయం ఏంటంటే...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో కీర్తిసురేష్ బ్యాంక్ ఆఫీసర్ గా వర్క్ చేస్తుందట. తను వర్క్ చేస్తున్న బ్యాంక్ లో జరిగిన ప్రాడ్ వల్ల జరిగే ట్విస్ట్, దానితో మహేష్ బాబుకు ఉన్న లింక్ తదితర అంశాలతో ఈ స్టోరీ లైన్ ఉంటుందట. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సినిమా టైటిల్ కి, మహేష్ బాబు ఫ్రీ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేష్ బాబు జి.యం.బి ఎంటర్ టైన్ మెంట్, 14రీల్స్ ప్లస్ బ్యానర్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.