View

హీరో కొడుకు హీరో అవుతాడు.. తప్పేంటి?

Tuesday,September01st,2020, 07:27 AM

వారసులు లేని రంగం ఉంటుందా? సినిమాలు, రాజకీయాలు, వ్యాపారాలు.. ఎక్కడైనా వారసులు ఉంటారు. ‘ఆడొచ్చాడు.. ఆడి కొడుకొచ్చాడని చెప్పండి’ అని ‘మిర్చి’లో ప్రభాస్ చెప్పిన డైలాగుని గుర్తు చేసుకుందాం. రియల్ లైఫ్ లో హీరో కొడుకు హీరో అవుతాడు.. హీరోయిన్ కూతురు హీరోయిన్ అవుతుంది. డైరెక్టర్ గారి కొడుకు డైరెక్టర్ అవుతాడు. అది కామనే. రాజకీయాల్లోనూ తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత కొడుకుకో, కూతురికో ఆ పదవి వచ్చే చాన్స్ ఉంటుంది కదా. అంబానీ కొడుకులు తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు కదా. మరి.. సినిమా పరిశ్రమలో మాత్రం వారసులు వస్తే తప్పేంటి? ఇప్పుడు ఈ చర్చ బాలీవుడ్లో బాగా జరుగుతోంది.


వారసులకు ఉండే లాభాలేంటంటే..
చేతిలో విజిటింగ్ కార్డు ఉంటుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఈజీ అయిపోతుంది. రెడ్ కార్పెట్ పరిచేస్తారు. అడుగులకు మడుగులొత్తుతారు. సుకుమారంగా చూసుకుంటారు. ఇన్ని లాభాలుంటాయి. అయితే ఈ లాభాలతో ప్రేక్షకులకు సంబంధం ఉండదు కదా. వాళ్లకు ముఖం నచ్చాలి... నటన నచ్చాలి. అప్పుడే స్టార్ ని చేస్తారు. పైగా ఫలానా హీరో కూతురంటే ఆ ఫలానా హీరో బ్రహ్మాండమైన నటుడైతే... అతనిలా అతని వారసులు నటించాలని ఓ ఎక్స్ పెక్టేషన్ ఉంటుంది. దాన్ని చేరుకోవాలి కదా. అప్పుడే నిలబడగలరు. సో. ఎంట్రీ ఈజీయే కానీ నిలబడటం అంటే అంత సులువు కాదు. నిరూపించుకోవాలి.


అవుట్ సైడర్స్ కి ఉండే కష్టాలేంటి?
ఫొటో ఆల్బమ్ పట్టుకుని ఆఫీసులు చుట్టూ తిరగాలి. కొందరి చెప్పులు అరిగిపోతాయి కూడా. కొందరు అదృష్టవంతులకు అది జరగకుండానే అవకాశం వస్తుంది. కానీ అడుగులకు మడుగులొత్తేవాళ్లు ఉండరు. సుకుమారంగా చూసుకునేవాళ్లు ఉండరు. పైగా అవకాశం ఇచ్చాం కదా అని ట్రీట్ మెంట్ విషయంలో కొంచెం తక్కువగానే చూస్తారు. ఇవన్నీ భరించి తెర మీద కనబడ్డాక.. ఆడియన్స్ కి నచ్చితే ఓకే. దాంతో పాటు సినిమా కూడా హిట్టవ్వాలి. లేకపోతే రెండో అవకాశం కష్టమే. అదే వారసులకయితే ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు నిర్మించేవాళ్లు రెడీగా ఉంటారు. అవసరమైతే హోమ్ బేనర్లు ఉండనే ఉంటాయి..


కరణ్ జోహార్ ఉన్నాడుగా...
బాలీవుడ్ లో అయితే వారసులను ఎంకరేజ్ చేయడానికి కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాతలు ఉండనే ఉంటారు. ఇది మనం అంటున్న మాట కాదు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, స్టార్ గా ఎదిగిన కంగనా రనౌత్ అంటున్న మాట. ఆలియా భట్, జాన్వీ కపూర్ వంటి వారసులను కరణ్ బాగా ఎంకరేజ్ చేస్తాడని కంగనా అంటోంది.


మరి.. కంగనాలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కొందరు మాత్రం.. ఆమె అంత ఘాటుగా స్పందించడంలేదు. ‘మా అవకాశాలు మాకు ఉంటాయి’ అని తాప్సీ అంటోంది. ‘ఇప్పుడు కొత్తవాళ్లకు బోలెడన్ని ప్లాట్ ఫాములున్నాయి’ అని స్వరా భాస్కర్ అంటోంది. ‘వారసులకే ఎక్కువ టెన్షన్ ఉంటుంది.. వాళ్ల అమ్మానాన్నలతో పోల్చుతారు.. పాపం’ అని కూడా స్వరా అంటోంది. మరో హీరోయిన్ సీరత్ కపూర్ ‘నెపోటిజమ్ ఉంటే ఉండొచ్చు. వారసులకు కొన్ని సౌకర్యాలు ఉంటాయి. అందులో తప్పేంటి? నటనతో నిరూపించుకునే వాళ్లే ఫైనల్ గా నిలబడతారు. అది వారసులైనా.. కొత్తవాళ్లయినా’ అని కూడా అంటోంది సీరత్ కపూర్.


పాయింటే కదా...
ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, విద్యబాలన్ లాంటి నాయికలు ఏ బ్యాక్ గ్రౌండ్ తో పైకొచ్చారు. నో గాడ్ ఫాదర్. టాలెంట్ ని నమ్ముకున్నారు. స్టార్స్ అయ్యారు. హీరోల విషయానికొస్తే.. ముందు అక్షయ్ కుమార్ హోటల్ వెయిటర్. ఆ తర్వత యాక్టర్ అయ్యాడు. స్టార్ అయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సంపాదన ఉన్న సెల్రబిటిగా ఎంటర్ టైన్ మెంట్ లో మన అక్షయ్ దే పై చేయి. మరి తనను ఏ వారసుడూ ఆపలేకపోయాడా? టాలెంట్ ని ఎవరు ఆపగలుగుతారు? రణ్ వీర్ సింగ్ కి ఏ గాడ్ ఫాదర్ లేడు. చిచ్చర పిడుగులా దూసుకొచ్చాడు. వారసులకన్నా ఓ మెట్టు పైనే ఉన్నాడు.


మరి.. నెపోటిజమ్ గురించి చర్చ ఎందుకూ? అంటే… స్టార్ అయ్యేంతవరకూ అవుటర్స్ కి పాట్లు తప్పవు. ఎప్పుడు గుర్తొచ్చినా ముళ్లులా గుచ్చుకునే చేదు అనుభవాలు కొందరికి ఎదురవుతాయి. కంగనా లాంటి వాళ్లు అలాంటివి ఎదుర్కొని ఉంటారు కాబట్టే నెపోటిజమ్ గురించి ఘాటుగా మాట్లాడుతుంటారని పరిశీలకులు అంటుంటారు. అది నిజం కావొచ్చు.ఏది ఏమైనా… టాలెంట్.. దాంతో పాటు లక్.. దాంతో పాటు హిట్.. ఈ మూడు కలిసొస్తేనే ఇన్ సైడర్స్ అయినా అవుట్ సైడర్స్ అయినా స్టార్ అవ్వగలిగేది. ఏమంటారు?Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !