View

'పెదరాయుడు' డా.మోహన్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు

Sunday,March19th,2023, 07:32 AM

మహానుభావుల విజయగాధలు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఓ సామాన్య వ్య‌క్తి నుండి అస‌మాన్య శక్తిగా ఎదిగి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో సుస్థిర స్తానం సంపాదించుకొన్న నిత్య నూతన కళాకారుడు. కళామతల్లి ముద్దుబిడ్డ.. సినిమా ప్రేక్షకుల పెద‌రాయుడు, నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారక్టర్ నటుడు మంచు భక్తవత్సలం నాయుడు ఆయ‌నే మంచు మోహన్ బాబు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోటకట్టుకున్న డా. మంచు.మోహన్ బాబుకు జన్మదినం ఈరోజు.


చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో 1952 మార్చి 19 న జన్మించిన‌ ఆయన ప్రాధమిక విద్య యర్పేడు, తిరుపతిలలో సాగింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మోహన్ బాబుకు చిన్నప్పటి నుండి నాటకాలఫై ప్రత్యేక అభిమానం. అలా నాటకలపై శ్రద్ధాసక్తులు కనబరుస్తూ తనతో పాటే నటనఫై ఆసక్తి పెరిగింది. అలా సినిమాల్లో నటించాలనే ఆలోచన, గొప్పవాణ్ణి కావాలనే కల ఆయన్ని ఎన్నో నిదురలేని రాత్రులని గడిపేలా చేసింది. తన కల నేరవేర్చుకోవటానికి మ‌ద్రాసుకు వెళ్లారు. అక్కడ కొన్నాళ్ళు వై.యం.సి.ఏ. కాలేజీలో ఫిజికల్ ట్రైనీగా పనిచేసారు. కానీ నటుడు అవ్వాలనే కోరిక ఆయన్ని నిలకడగా నిలబడనియ్యక పరుగులెత్తించింది. అవకాశాలకోసం ఎండా, వానా, ఆకలి దప్పికలు లెక్కచేయక అహర్నిశలు శ్రమించారు. అలా ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర పనిచేసారు. 1975 లో దాసరి నారాయణరావు గారు కొత్త నటి నటులతో నిర్మించ తలపెట్టిన 'స్వర్గం-నరకం' చిత్రం కోసం జరిగిన ఆడిషన్ లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తోలి ఆవకాశం సంపాదించారు. దాసరి గారే భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండి తెరకు పరిచయం చేసారు.


'స్వర్గం నరకం' చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు 573 చిత్రాలకు పైగా నటించి నవరసాలు పండించాడు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అందులో అల్లుడుగారు, అసెంబ్లీ రౌడి, రౌడీ గారి పెళ్ళాం, మోహన్ బాబు ని హీరోగా నిలబెట్టాయి. ఆ తరవాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా 'కలెక్షన్ కింగ్' గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరవాత వచ్చిన 'పెదరాయుడు' ఇండస్ట్రి హిట్ గా నిలిచింది. అంతే కాకుండా పెదరాయుడి సినిమా సాధించిన రికార్డులను ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా తాకాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీ రాములయ్య , అడవిలో అన్న తో మోహన్ బాబు లో మరో నటుడిని ప్రేక్షకులకు చూసారు. వీటితో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు.


అలాగే 1983 లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ స్థాపించి నిర్మాతగా మారి 72కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా 1992 లో విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్న మోహన్ బాబు తన ఇంట్లో పిల్లలనే కాదు బడిలో పిల్లలను సైతం క్రమశిక్షణగా పెరిగేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్, అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ఆయనకు "నటప్రపూర్ణ", "డైలాగ్ కింగ్", "కల్లెక్షన్ కింగ్" అనే బిరుదులు కాకుండా 'యాక్టర్ ఆఫ్ ది మిలీనియం' లాంటి పలు బిరుదులు ఉన్నాయి. వీటితో పాటు తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చింది. ఇవే కాకుండా 'నటవాచస్పతి' 2015 లో 'స్వర్ణకనకం' 2016లో నవరస నటరత్నం అవార్డులు పొందారు. 1995 లో యన్.టి.ఆర్ ప్రోద్బలంతో 2001 వ‌ర‌కు రాజ్యసభ ఎమ్.పి. గా పనిచేసారు.


ఆయన మాత్రమే కాదు ఆయన పిల్లలు అయిన మంచి విష్ణు బాబు, లక్ష్మీప్రసన్న, మనోజ్ లు సైతం క్రమశిక్షణగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ప్రేమను పొందుతున్నారు. ఇక మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసి పలు కమర్షియల్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకవైపు సినిమాలు మరో వైపు విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటూ గత సంవత్సరం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిసి సినిమా ఆర్టిస్టులకు తన వంతు సేవ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి సైతం తండ్రి మోహన్ బాబు బాటలోనే నడుస్తూ సినిమాలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గత సంవత్సరం యాదగిరిగుట్ట పరిధిలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకొని తండ్రి పెంపకం అంటే నిరూపించారు. అలాగే సినిమాల్లో రాణిస్తూనే... సమాజంలో అడబిడ్డలపై ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా వారి కుటుంబం తరుపున నిలబడి న్యాయం కోసం నిలబడే మరో డైనమిక్ మనిషి మంచు మనోజ్.. ఇలా మంచు మోహన్ బాబు ఆయనే కాకుండా కుటుంబం అంత సమాజ స్పృహ ఉన్నవారే కావడం గొప్ప విషయం.


కళ ను  కళాకారులను అమితంగా అభిమానించే మోహన్ బాబు సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించ‌డంతో పాటు ఆయ‌నే హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తూ పలు సినిమాల్లో న‌టిస్తున్నారు. వెండితెరపై అదే ఉత్సాహంతో ఇలాగే మ‌రిన్ని చిత్రాల్లో న‌టిస్తూ మ‌న‌ల్ని ఎప్పుడు అలరించాలని కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !