View

అంచనాలు పెంచిన 'రానా' ఫస్ట్ లుక్ & టీజర్ 

Thursday,March23rd,2023, 02:07 PM

మణికొండ రంజిత్ సమర్పణలో తన్విక & మోక్షిక క్రియేషన్స్ పతాకంపై రవితేజ నున్నా, నేహా జూరేల్ జంటగా సత్య రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామి శెట్టి సుబ్బారావు నిర్మించిన చిత్రం "రానా" (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) అనేది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ "రానా" ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్, స్వామి నాయుడు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


గెస్ట్ గా వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ..టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్ చూయించిన విజువల్స్ లోనే కంటెంట్, క్రియేటివిటీ కనిపిస్తుంది.కాబట్టి మంచి కంటెంట్ తో వస్తున్న "రానా" సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.


గెస్ట్ గా వచ్చిన దర్శకులు వీరుపొట్ల మాట్లాడుతూ .దర్శకుడు సత్య రాజ్ లో మంచి ట్యాలెంట్ ఉంది. తన రైటింగ్ స్క్రిల్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ చాలా చక్కగా వివరిస్తాడు. టైటిల్ తో పాటు టీజర్ లో చాలా క్యూరియాసిటీ ఉంది.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
గెస్ట్ గా వచ్చిన దర్శకులు నక్కిన త్రినాధ్ రావ్ గారు మాట్లాడుతూ టైటిల్ డిఫరెంట్ గా ఉంది. మంచి లవ్, & క్రైమ్ కథ తో వస్తున్న ఈ టైటిల్ యాప్ట్ అనిపించేలా ఉంది. దర్శక, నిర్మాతలు ఈ సినిమా తర్వాత ఇలాంటి మంచి కంటెంట్ ఉండే సినిమాలు ఎన్నో తియ్యాలి అన్నారు.


గెస్ట్ గా వచ్చిన నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. టైటిల్ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ చాలా బాగుంది. ఈ టీజర్ చూస్తుంటే ఇందులో RX 100, ఉప్పెన సినిమాల్లా మంచి కంటెంట్ ఉన్నట్లు కనిపిస్తుంది. మంచి కంటేట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత రామి శెట్టి సుబ్బారావు మాట్లాడుతూ..మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్ స్వామి నాయుడు తదితరులందరికీ మా ధన్యవాదాలు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సగటు ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.


చిత్ర దర్శకులు సత్యరాజ్ మాట్లాడుతూ.. మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. 'రానా' (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ & క్రైమ్ స్టోరీ.ఈ కథలో లవ్, ఎమోషన్, డ్రామా ఫన్ సస్పెన్సు ఇలా అన్ని కలగలపిన ఉగాది పచ్చడిలా ఈ సినిమా ఉంటుంది . నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. వీరందరి సపోర్ట్ చేయడం వలన సినిమా బాగా వచ్చింది.చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.


గెస్ట్ గా వచ్చిన రామదాసు మాట్లాడుతూ.. రానా రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి టైటిల్ బాగా ఉంది. డైరెక్టర్ సత్యారాజ్,మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నారు. ప్రొడ్యూసర్ సుబ్బారావు ఆ కథను నమ్మి చేస్తున్నాడు. కంటెంట్ ను నమ్ముకొని తీసుకొని తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి . కాబట్టి ఈ సినిమాలో ఎమోషన్, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.


గెస్ట్ గా వచ్చిన స్వామి నాయుడు మాట్లాడుతూ..నిర్మాత నెల్లూరు జిల్లాలో ఆపదలో ఉన్న ఎంతోమందికి హెల్ప్ చేశాడు. సీతాకొక చిలుక వంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.


చిత్ర హీరో రవితేజ నున్నా మాట్లాడుతూ.. ఇది నామొదటి చిత్రం. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.


నటీ నటులు 
రవితేజ నున్నా, నేహా జూరేల్, నాగి నీడు, ప్రమోదిని, యోగి కాత్రి, అజీజ్, వీరేంద్ర, కంచిపల్లి అబ్బులు, జబర్దస్త్ బాబీ, జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజీ, అప్పిరెడ్డి మోహన్ తదితరులు


సాంకేతిక నిపుణులు 
సమర్పణ : మణికొండ రంజిత్  బ్యానర్ : తన్విక & మోక్షిక క్రియేషన్స్  రైటర్ & డైరెక్టర్ : సత్య రాజ నిర్మాత : రామిశెట్టి వెంకట సుబ్బారావు  మ్యూజిక్ : రోషన్ సాలూరి à°¡à°¿. à°“. పి : మురళి కృష్ణ వర్మ  కో ప్రొడ్యూసర్ : కలవకొలను సతీష్, రత్నవీర్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : రెంటికోట ధర్మ, రవి.యం  ఎడిటర్ : కిషోర్ కొరియోగ్రఫీ : రవి. యం à°ªà°¿ ఆర్. à°“ : హరీష్, దినేష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !