స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాకి విలన్ ప్రాబ్లమ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి విలన్ గా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు విజయ్ సేతుపతి. అప్పట్నుంచి ఈ సినిమాకి విలన్ ని సెట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. మాధవన్, ఆర్య, సముద్రఖని.. ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. కానీ వారెవ్వరూ ఫైనలైజ్ అవ్వలేదు. తాజాగా మరో తమిళ హీరో పేరు వినిపిస్తోంది.
కోలీవుడ్ హీరో శింబు ను 'పుష్ప' లో విలన్ గా నటింపజేయడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని సమాచారమ్. ఆల్ రెడీ శింబును సంప్రదించారా లేదా ఇకపై సంప్రదించనున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే, హీరోగా సినిమాలు చేస్తున్న శింబు 'పుష్ప' లో విలన్ గా నటించడానికి అంగీకరిస్తాడా వేచిచూద్దాం.