మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'గని'. ఇటీవల విడుదలైన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు.ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్‌తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్‌తో బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.