స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ని తమిళనాడులో ప్లాన్ చేసారు.
డ్యాన్స్ మాస్టర్ జాని ఈ సినిమా షూటింగ్ కోసం తమిళనాడులోని 'తెన్ కాశి' కి వెళుతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. దీన్నిబట్టి 'పుష్ప' కి సంబంధించిన పాట చిత్రీకరణ కోసమే జాని మాస్టర్ తెన్ కాశి వెళతున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాని మాస్టర్ రంగంలోకి దిగారంటే... అది ఖచ్చితంగా మాస్ సాంగ్ అని కూడా ఫిక్స్ అయిపోవచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాల పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 'పుష్ప' పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం.