'రంగమ్మత్త' అనగానే గుర్తుకు వచ్చేది ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే రాంచరణ్ 'అత్త' అత్త' అంటూ 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త' క్యారెక్టర్ ని ఎంత ఆప్యాయంగా పిలుస్తాడో, ఆ క్యారెక్టర్ చేసిన అనసూయ ఎంత అద్భుతంగా నటించిందో గుర్తు చేయాల్సిన అవసరంలేదు. 'రంగస్థలం' లో అంత మంచి క్యారెక్టర్ చేయించిన డైరెక్టర్ సుకుమార్ తన తాజా సినిమా 'పుష్ప' లో కూడా అనసూయతో ఓ మంచి పాత్ర చేయించబోతున్నారనే వార్తలు హల్ చల్ చేసాయి. అయితే ఈ విషయంలో అనసూయ క్లారటీ ఇచ్చేసింది.
'పుష్ప' సినిమాలో నేను నటిస్తున్నాననే వార్తలు నిజం కాదు. వాళ్లు నన్ను ఏ పాత్ర కోసం అప్రోచ్ అవ్వలేదు. 'పుష్ప' సినిమాలో నేను కీలక పాత్ర చేస్తున్నాననే వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి'' అని చెప్పింది అనసూయ. ఇదిలా ఉంటే...
ప్రస్తుతం అనసూయ 'రంగమార్తాండ', 'కిలాడి' సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తను స్పెషల్ సాంగ్ చేసిన 'చావు కబురు చల్లగా' సినిమా ఈ నెల 19న థియేటర్స్ కి వస్తోంది.