యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న #NTR30 కి సంబంధించి తాజా అప్ డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...ఈ సినిమాలో లేడీ విలన్ క్యారెక్టర్ ఒకటి ఉందట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ లేడీ విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. కాగా ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ ను తీసుకున్నారనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
'క్రాక్' సినిమాలో జయమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన 'నాంది' సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన లాయర్ పాత్రకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమెకు టాలీవుడ్ ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ సినిమాలో ఆఫర్ అంటే టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి రూటు ఏర్పడినట్టేనని చెప్పొచ్చు. మరి వస్తున్న అవకాశాలను వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా క్యాష్ చేసుకుంటుందో వేచిచూద్దాం.