పూజా హెగ్డె, రష్మిక మందన్నా... ఈ ఇద్దరూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మధ్య కొన్ని సినిమాలకు దర్శక, నిర్మాతలు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలను పరిశీలించడం, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆ అవకాశం వరించడం జరుగుతోంది. తాజాగా ఓ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఆ సినిమా, ఆ హీరో వివరాల్లోకి వెళితే...
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తదుపరి సినిమా కోసం రష్మిక మందన్నా, పూజా హెగ్డె లను పరిశీలించారు దర్శక, నిర్మాతలు. రష్మిక, పూజా హెగ్డె ఇద్దరూ ఈ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి కూడా ఆసక్తి కనబర్చారట. అయితే ఫైనల్ గా పూజా హెగ్డె ను ఈ సినిమా అవకాశం వరించింది. అఫీషియల్ గా చిత్రం యూనిట్ పూజా హెగ్డె పేరును ప్రకటించేసారు. ఈ సినిమా కోసం పూజా హెగ్డె కి 3కోట్ల పారితోషికం దక్కుతోందట.
సో... ఓ మంచి ఆఫర్ రష్మిక చేజారి, పూజా హెగ్డె ని వరించినట్టే కదా...!