View

ఇంటర్య్వూ - హీరో దినేష్ తేజ్ (అలా నిన్ను చేరి)

Thursday,November09th,2023, 03:53 PM

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు  హీరో హీరోయిన్లుగా రాబోతున్న  à°“ మంచి ఫీల్ గుడ్ మూవీ ‘అలా నిన్ను చేరి’. à°ˆ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి à°ˆ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. చిత్రం నవంబర్ 10à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  à°ˆ క్రమంలో హీరో దినేష్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.


 *అలా నిన్ను చేరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? ఎలాంటి ఫీలింగ్ ఉంది?* à°…లా నిన్ను చేరి అంటూ కొత్తగా ప్రయత్నించాను. కమర్షియల్ ‌రోల్‌ను పోషించాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ప్రతీ ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎదురయ్యే సంఘర్షణే ఇందులో ఉంటుంది. ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అన్నది చూపిస్తాం. à°† పాయింటే నాకు à°ˆ సినిమా చేయడానికి స్పూర్తిని ఇచ్చింది.


 *‘ప్లే బ్యాక్’ తరువాత చాలా గ్యాప్‌తో వస్తున్నట్టున్నారు? ఎలా అనిపిస్తోంది?* à°•à°°à±‹à°¨à°¾ టైంలో వచ్చిన ప్లే బ్యాక్ వల్ల మంచి పేరు వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. నాకు మంచి ప్రశంసలు దక్కాయి. à°† తరువాత à°“ చిత్రం థియేటర్లోకి వచ్చింది కానీ అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు à°ˆ చిత్రంతో ఎలాంటి ప్రశంసలు వస్తాయో చూడాలి.


 *ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం కష్టం కదా? మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు?* à°‡à°‚డస్ట్రీలో అందరికీ కష్టాలుంటాయి. కానీ మన వద్దకు వచ్చే స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. జనాలకు నచ్చే కథల్లో కనిపించాలి. 


 *à°ˆ పాత్రతో మీ రియల్ లైఫ్‌కు సంబంధం ఉంటుందా?* à°—ణేష్ పాత్రకు సినిమాల్లోకి రావాలని à°Žà°‚à°¤ ప్యాషన్ ఉంటుందో.. దినేష్‌à°•à°¿ కూడా అంతే ఉంటుంది.


 *ఇద్దరు హీరోయిన్లతో కెమిస్ట్రీ ఎలా ఉంది?* à°¹à±†à°¬à±à°¬à°¾ పటేల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె అద్భుతంగా నటించారు. సెట్‌లో ఆమె ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. పాయల్‌ నటన గురించి ఇప్పుడు ప్రేక్షకులు తెలుసుకుంటారు. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.


 *చంద్రబోస్ సాహిత్యం మీ సినిమాకు à°Žà°‚à°¤ మేరకు ఉపయోగపడింది?* à°šà°‚ద్రబోస్ గారు రాసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. మా సినిమాకు పాటలు రాస్తున్న టైంలోనే ఆయనకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.


 *సుభాష్ ఆనంద్ గారి సంగీతం ఎలా ఉంది?ఆయన గురించి చెప్పండి* à°¸à±à°­à°¾à°·à± ఆనంద్ గారు à°ˆ సినిమా తరువాత నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తారు. మా సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించారు.


 *దర్శకుడితో పరిచయం ఎలా ఏర్పడింది?* à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± మారేష్ శివన్ హుషారు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌à°—à°¾ పని చేశారు. à°† మూవీ అయిన ఏడాదికి నా వద్దకు వచ్చి à°ˆ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. à°•à°¥ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వెంటనే ఓకే చెప్పాను.


 *పెద్ద చిత్రాలతో ఎందుకు పోటీ పడుతున్నారు?* à°œà°ªà°¾à°¨à±, జిగర్ తండా డబుల్ ఎక్స్ వస్తున్నాయని మాకు తెలియదు. అయినా సినిమా బాగుందంటే ఆడియెన్స్ కచ్చితంగా చూస్తారు. మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు. à°ˆ చిత్రంలో హెబ్బా పాత్రతోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !