విక్టరీ వెంకటేష్,మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3 తో థియేటర్లో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈసినిమానిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్ నుచిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎఫ్3 సమ్మర్ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ కాబోతుందని థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
2 నిమిషాల 32 సెకన్లు నిడివిగల ఈ ట్రైలర్, ఆద్యంతం వినోదాన్నిపంచింది. ఎఫ్ 3 కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని మొదటే చెప్పిన చిత్ర యూనిట్... ట్రైలర్ లో మిడిల్ క్లాస్ మనీ డ్రీమ్స్ ని హిలేరియస్ గా చూపించారు. ''ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటుంది... అదే డబ్బు'' అనే క్యాచి డైలాగ్ తో మొదలైన ట్రైలర్.. ప్రేక్షకులని నవ్వులతో కట్టిపడేసింది.
''మనీ ప్లాంట్ బిర్యానీ, మనీ ప్లాంట్ చారు,మనీ ప్లాంట్ వేపుడు .. ఏంటి ఫుడ్ కూడా మనీ ప్లాంట్ తోనేనా ? తప్పదయ్యా బాగా డబ్బులు రావాలి కదా..అనే డైలాగు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్టింగా వుంది.
'మన ఆశలే మన విలువలు'' పాతిక లక్షలు.. తెల్లారేసరికి యాభై లక్షలైపోవాలి.. అనే డైలాగ్స్ కూడా కంటెంట్ వైజ్ వినోదాన్ని పంచాయి.
''వాళ్ళది పెద్ద మాయల మరాఠి ఫ్యామిలీ'' అని రఘుబాబు అంటే''వాళ్ళది మరాఠి ఫ్యామిలీ అయితే మనది దగ్గుబాటి ఫ్యామిలీ'' అని వెంకటేష్ చెప్పడం...
'వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ'' అని వెంకటేష్ అంటే'వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మనది మెగా ఫ్యామిలీ'' అని వరుణ్ తేజ్ అనడం ట్రైలర్ లో ఒక హైలెట్ గా నిలిచింది. ఈ డైలాగ్ ఎఫ్ 3పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
వెంకటేష్, వరుణ్ తేజ్ పాత్రలని వినోదాత్మకంగా మలచిన దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కి ఒక సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. వెంకటేష్ రేచీకటి, వరుణ్ తేజ్ నత్తి వున్న పాత్రలలో కనిపించడం ప్రేక్షకులకు సర్ ప్రైజ్ వినోదాన్ని ఇచ్చింది.
అక్కాచెల్లులుగా తమన్నా, మెహ్రీన్ మరోసారి ఆకట్టుకున్నారు. ఎఫ్ 3 లో కొత్తగా చేసిన సునీల్ కూడా తన మార్క్ తో ఆకట్టుకున్నారు.''ఆడోళ్ళు బంగారు చూస్తే అంతే సైకోలైపోతారు'అని సునీల్ పలికిన డైలాగ్ కూడా సూపర్ గా పేలింది. ట్రైలర్ లో వెన్నెల కిషోర్ పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ గా అలరించాడు.
హిలేరియస్ ఎంటర్టైనర్ లను రూపొందించడంలో అనిల్ రావిపూడి మరోసారి తన నైపుణ్యాన్ని చూపించాడు. ఎఫ్ 2కి మించిన వినోదం ఎఫ్3లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
టెక్నికల్ టీమ్ వర్క్ విషయానికి వస్తే, సాయి శ్రీరామ్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టారు.
మొత్తానికి ఎఫ్ 3 ట్రైలర్ సినిమాపై అంచనాలని డబల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్3 థియేటర్లలో కి వస్తుంది.
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్, పూజా హెగ్డే (స్పెషల్ అప్పీరియన్స్) తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి సమర్పణ: దిల్ రాజు నిర్మాత : శిరీష్ బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ డివోపీ: సాయి శ్రీరామ్ ఆర్ట్ : ఎఎస్ ప్రకాష్ ఎడిటర్ : తమ్మిరాజు స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : ఎస్ కృష్ణ అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్