View

గోవిందుడు అందరి వాడేలే' టీజర్ ఆవిష్కరణ విశేషాలు

Thursday,August07th,2014, 05:04 PM

''చిరంజీవితో ఓ యాడ్ షూట్ చేసినప్పుడు, నాకు ఆయన వాడిన ల్యాండ్ క్రూజర్ కార్ బాగా నచ్చింది. ఆ విషయాన్ని ఆయనతో అన్నాను. ఓ రోజు ఆయన నాకు ఫోన్ చేసి రమ్మని ఆ కారుని బహుమతిగా ఇచ్చారు. నేనది ఊహించలేదు'' అని కృష్ణవంశీ చెప్పారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో గల రామానాయుడు స్టూడియోలో జరిగింది. పరుచూరి వెంకటేశ్వరరావు టీజర్ ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కృష్ణవంశీ మరిన్ని విశేషాలు చెబుతూ- ''గత మూడు, నాలుగేళ్లుగా కెరీర్ పరంగా కొంచెం డౌన్ లో ఉన్నాను. కానీ, ఎదురీదాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ని కలిసినప్పుడు నాకంత ఆత్మవిశ్వాసం లేదు. కానీ, తను తన కుర్చీని నాకిచ్చి, నాకెదురుగా కూర్చున్నాడు. నాకు చాలా మర్యాద ఇచ్చాడు. ఇక, చిరంజీవి అయితే నాకు వెయ్యేనుగుల బలం ఇచ్చారు. రామ్ చరణ్ తప్పకుండా సినిమా చేస్తాడని, కథ చెప్పమని ఆయన అన్నారు. నేనెంతోమంది ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాను కానీ, నాకెవరూ అవకాశం ఇవ్వలేదు. నాకు అవకాశం ఇచ్చిన ఆర్టిస్ట్ రామ్ చరణ్. తను సంస్కారవంతుడు. లండన్ లో ఉండే ఓ యువకుడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ గ్రామంలో తన మూలాలను వెతికే కథ ఇది. రామ్ చరణ్ తీరుని క్షుణ్ణంగా పరిశీలించి, చేసిన సినిమా ఇది. గత ఐదేళ్లుగా యువన్ శంకర్ రాజా కోసం ఎదురు చూస్తున్నాను. చివరికి ఈ సినిమాకి కుదిరింది. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి ఓ పిల్లర్ లాంటివాడు. మరో 50 ఏళ్ల వరకు నిలిచిపోయే సినిమా ఇది'' అని చెప్పారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ - ''తెలుగు సినిమా పరిశ్రమకు కృష్ణవంశీ ఓ ఎస్సెట్. 'మగధీర'వంటి శక్తిమంతమైన చిత్రం చేసిన తర్వాత ఓ సున్నితమైన సినిమా చేయాలనుకున్నాను. అప్పుడే కృష్ణవంశీని కలిశాను. నాతో సినిమా చేయమని కోరాను. కుటుంబ కథా చిత్రం చేయాలనుకున్నాను. అది కూడా కృష్ణవంశీతోనే చేయాలనుకున్నాను. అది నెరవేరింది. ఈ కథకు మంచి తారాగణం చాలా ముఖ్యం. ప్రకాశ్ రాజ్, జయసుధ ఈ చిత్రం చేయడంతో ఓ పరిపూర్ణత సంతరించుకుంది. కాజల్ అగర్వాల్ తో నాకిది మూడో సినిమా. ఇక, 'ఆనంద్', 'గోదావరి' చిత్రాలు చూసిన తర్వాత కమలినీ ముఖర్జీ కి అభిమాని అయ్యాను. తను ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రవిజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది'' అన్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ - ''కృష్ణవంశీతో కొంత విరామం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మానవీయ విలువల నేపథ్యంలో సాగే కథ ఇది. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలో తెలియజేసే సినిమా. 'చిరుత'కు ముందు నుంచే నాకు రామ్ చరణ్ తెలుసు. తను సినిమా సినిమాకీ ఎదుగుతున్నాడు. చరణ్ ని కొత్త కోణంలో చూపిస్తున్నాడు కృఫ్ణవంశీ'' అని తెలిపారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ - ''ఈ చిత్రం విడుదల తర్వాత తెలుగు పరిశ్రమ కృష్ణవంశీని చూసి గర్వపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఓన్ చేసుకుంటారు. యువన్ శంకర్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు'' అన్నారు.

ఇంకా ఈ వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు, కాజల్ అగర్వాల్, కమలినీ తదితరులు పాల్గొన్నారు.

 

Govindudu Andarivadele is releasing on oct1stAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !