UVT Studios Hollywood Production Company and Shriya Productions are jointly producing the upcoming movie 'Hara Om om Hara'. Kanika, Aamani, Ravi Varma, Jyoti Reddy, and Meka Ramakrishna are playing the lead roles in this movie produced by Devendra Madan Singh Negi and Ashok Khullar and directed by Sher. Apart from directing this movie, Sher is also playing an important role. Freshly, The first look poster of this family entertainer has been released.
Hero Suman, Telangana Film Chamber of Commerce (TFCC) Chairman Pratani Ramakrishna Goud, and TFCC Vice Chairman Guru Raj participated in the event and have also unveiled the first-look poster. The makers are making it as a wholesome family entertainer that can be watched by the whole family.
Bashya Sree, who has penned songs for many super hit films, is the lyricist for this film. Kaveti Praveen is the cameraman, while the director Sher is also scoring the music. DV Prabhu is working as an editor for this movie.
Jabardasth Rakesh, Jabardasth Kattappa, Vizag Sharif, Shelza, Nehaben, Sangeetha, Prakash Nag as villain, and Sher are the other prominent cast in this movie.
Technical Crew:Banner: UVT Studios Hollywood Production Company, Shriya ProductionsProducers: Devendra Madan Singh Negi, Ashok KhullarStory, Screenplay, Music, Direction: SherDOP: Kaveti PraveenChoreographer: Sai RajLyrics: Bashya SreeFights: Shaolin MalleshEditor: DV PrabhuPRO: Sai Satish
హీరో సుమన్ చేతుల మీదుగా 'హర ఓం హర' టైటిల్ లోగో విడుదల
యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా 'హర ఓం హర' అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు షేర్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను తాజాగా రిలీజ్ చేశారు.
హీరో సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, టీఎఫ్‌సీసీ వైస్ చైర్మన్ గురు రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మేకర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
*టైటిల్ లోగో రిలీజ్ చేసిన అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ..* 'సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. దర్శకుడు షేర్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాల'ని అన్నారు.
*టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..* 'హర ఓం హర సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు షేర్‌కు అభినందనలు. షేర్ తెలుగులోనే కాకుండా అన్ని భాషల చిత్రాలను తెరకెక్కించే స్థాయికి చేరుకోవాలి. షేర్ ప్రతిభ ప్రపంచస్థాయికి వెళ్లాల'ని కోరుకున్నారు.
*టీఎఫ్‌సీసీ వైస్ చైర్మన్ గురురాజ్ మాట్లాడుతూ..* 'ఈ చిత్రం మంచి విజయం సాధించి యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సీనియర్ నటి ఆమని ఈ సినిమాలో నటించడం కలిసి వస్తుంది. ఈ సినిమాతో దర్శకుడు షేర్‌కు మరింత మంచి పేరు రావాల'ని కాక్షించారు.
*నటుడు, దర్శకుడు షేర్ మాట్లాడుతూ..* 'మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. నటుడిగా, హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా ఇలా పలు శాఖల్లో పని చేశాను. నాకు ఈ ఇండస్ట్రీలో భాష్య శ్రీ, డైరెక్టర్ బాలా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఈ సినిమాకు సుమన్ గారు, ప్రతాని రామకృష్ణ గౌడ్, గురురాజ్ గెస్ట్‌లుగా రావడం ఆనందంగా ఉంద'ని అన్నారు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పాటలను అందించిన భాష్య శ్రీ ఈ సినిమాకు పాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. కావేటి ప్రవీణ్ కెమెరామెన్‌గా, షేర్ దర్శకత్వ బాధ్యతలతో పాటు సంగీత దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. డీవీ ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్ నాగ్, షేర్ వంటి వారు నటిస్తున్నారు.
సాంకేతిక సిబ్బంది
బ్యానర్ : యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్నిర్మాతలు : దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్కథ, కథనం, దర్శకత్వం : షేర్సంగీతం : షేర్కెమెరామెన్ : కావేటి ప్రవీణ్కొరియోగ్రాఫర్ : సాయి రాజ్‌పాటలు : భాష్య శ్రీఫైట్స్ : షావోలిన్ మల్లేష్‌ఎడిటర్ : డీవీ ప్రభుపీఆర్వో : సాయి సతీష్