ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా టాలీవుడ్ లో సినిమాల సందడి అంబరాన్ని అంటింది. వారానికో సినిమా, ఆ సినిమా ఎలా ఉంటుందోననే ముచ్చట్లతో సినీ ప్రియులకు బాగానే టైమ్ పాస్ అయ్యింది. హిట్, ఫ్లాప్, యావరేజ్, అబౌవ్ యావరేజ్ సినిమాలు ప్రతి యేడాది ఉంటాయి. అయితే ఈ యేడాదికి ఓ ప్రత్యేకత ఉంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు టెక్నికల్ గా తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. 'బాహుబలి' చిత్రం అయితే తెలుగు సినిమా బిజినెస్ రూపురేఖలను మార్చేసింది. ఇక ఈ యేడాది తెలుగు ప్రేక్షకులు యూనానిమస్ గా జై కొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టిన చిత్రం 'శ్రీమంతుడు'. పెద్ద సినిమాలే విజయం సాధించాయనుకుంటే పొరపాటే. సింఫుల్ బడ్జెట్ తో రూపొందిన 'భలే భలే మగాడివోయ్', 'పటాస్', 'రాజుగారి గది'లాంటి చిత్రాలు ఊహించనంత విజయాన్ని అందుకుని ఆశ్చర్యపరిచాయి.
ఈ యేడాది టాప్ 5 హిట్స్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచిన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.
బాహుబలి
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్.. ఇలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో మూడేళ్ల పాటు రూపొందిన ఈ చిత్రం ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 100కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా రికార్డులు నెలకొల్పంది. అంచనాలకు మించి వసూళ్ల కురిపించి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. తెలుగు వెర్షనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళ వెర్షన్ లు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఓవర్ సీస్ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఓవర్ సీస్ లో తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది. ఫ్యాన్సీ ఆఫర్స్ తో ఓవర్ సీస్ హక్కులు దక్కించుకుని తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇతర భాషల్లో తెలుగు సినిమాలను విడుదల చేయడానికి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆ రకంగా తెలుగు సినిమాపై ప్రపంచ దృష్టి పడేలా చేసింది 'బాహుబలి'.
శ్రీమంతుడు
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా 'మిర్చి'లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శ్రీమంతుడు'. 'బాహుబలి' తర్వాత విడుదలైన పెద్ద చిత్రం ఇది. ఓ మంచి మెసేజ్ తో మహేష బాబులాంటి స్టార్ హీరోతో కొరటాల శివ చేసిన మ్యాజికి్ బాక్సాపీస్ ని షేక్ చేసింది. విడుదలైన తొలి రోజే యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీ వసూళ్లు సాధించింది. ఓవర్ సీస్ లో 'బాహుబలి' తర్వాత దగ్గర దగ్గర ఆ రేంజ్ వసూళ్లను కురిపించి తెలుగు సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది.85కోట్ల షేర్ ను వసూలు చేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది 'శ్రీమంతుడు'. ఈ యేడాది 'బాహుబలి' విడుదలవ్వకపోయుంటే మొదటి స్థానం 'శ్రీమంతుడు'దే అయ్యుండేది.
భలే భలే మగాడివోయ్
శ్రీమంతుడు విడుదలైన కొన్ని వారాల తర్వాత విడుదలైన చిత్రం 'భలే భలే మగాడివోయ్'. నాని, లావణ్య త్రిపాఠి జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎవరూ ఊహించని స్థాయి విజయాన్ని అందుకుంది. మీడియం బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఓవర్ సీస్ లోమిలియన్ డాలర్ల వసూళ్లను కురిపించి తన సత్తా చాటుకుంది. ఈ చిత్ర నిర్మాతలు మంచి లాభాలను చవిచూసారు.
పటాస్
గత యేడాది సంక్రాంతికి విడదులైన భారీ సినిమాలు 'గోపాల గోపాల', 'ఐ'. ఈ రెండు చిత్రాల తర్వాత విడుదలైన చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'పటాస్'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంచి విజయాన్ని చవిచూసింది. సక్సెస్ లో లేని కళ్యాణ్ రామ్ కి మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రం ద్వారా అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అయ్యారు. యేడాది ఆరంభంలోనే 'పటాస్' తో వచ్చిన హిట్ టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. పర్ ఫెక్ట్ కమర్షియల్ సినిమా అనే కితాబులందుకుంది.
టెంపర్
జనవరి తర్వాత ఫిబ్రవరిలో విడుదలైన చిత్రం 'టెంపర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎన్టీఆర్ ని 50కోట్ల క్లబ్ లో చేర్చింది. కమండబుల్ స్ర్కిఫ్ట్ తో కెరీర్ బెస్ట్ పెర్ ఫామెన్స్ ఆఫ్ ఎన్టీఆర్ గా ఈ చిత్రం ప్రశంసలందుకుంది. 'పటాస్' తో అన్నయ్య కళ్యాణ్ రామ్ విజయాన్ని చవిచూస్తే, ఆ వెంటనే తమ్ముడు ఎన్టీఆర్ 'టెంపర్' తో సక్సెస్ అందుకోవడం ఈ నందమూరి సోదరులను చాలా ఆనందపరిచింది.
ఈ యేడాది టాప్ 5 హిట్ చిత్రాలుగా నమోదైన చిత్రాలు ఇవి. దసరా బరిలో నిలిచిన పెద్ద సినిమాలు బయ్యర్స్ కి, పంపిణీదారులకు షాక్ ఇస్తే, 'రాజుగారి గది', ఆ తర్వాత విడుదలైన 'కుమారి 21ఎఫ్' లాంటి చిన్న చిత్రాలు మంచి వసూళ్లను కురిపించి స్వీట్ షాక్ ఇచ్చాయి.