పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే. ఆయనను కలుసుకోవడానికి అభిమానులు తహతహలాడుతుంటారు. కానీ అప్పుడప్పుడు తప్ప... రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ తో ముచ్చటించే అవకాశం దొరకక అభిమానులు నిరాశపడుతుంటారు. అయితే ఈ యేడాది (2015) ఫస్ట్ డే జనవరి 1న న్యూ ఇయర్ గిఫ్ట్ గా అభిమానుల కోసం ట్విట్టర్ లో అకౌంట్ తెరిచాడు పవన్ కళ్యాణ్. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఫస్ట్ ట్వీట్ చేసాడు. ట్విట్టర్ అకౌంట్ తెరిచిన గంటలోపే 5వేల మంది ఫాలోయర్స్ పవన్ ట్విట్టర్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టేసారు. అడపాదడపా ట్విట్టర్ ద్వారా ఏదో ఒక మెసేజ్ పెట్టి అభిమానులను ఖుషీ చేస్తూనే ఉన్నాడు.
ఇక 2016 ఫస్ట్ డే జనవరి 1న కూడా అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం టీజర్ ని విడుదల చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా సరిగ్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సంవత్సవం ఎంటరైన ఘడియల్లో 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ ని విడుదల చేయబోతున్నారట. టీజర్ అద్భుతంగా ఉండేలా కట్ చేస్తున్నారట.
సో.. పవన్ ఫ్యాన్స్ బి రెడీ... 2015 ఫస్ట్ డే పవన్ ఇచ్చిన గిఫ్ట్ అభిమానులను చాలా సంతోష పెట్టింది. 2016 ఫస్ట్ డే పవన్ ఇవ్వబోతున్న గిఫ్ట్ కూడా అభిమానులను చాలా సంతోషపెడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.