View

వెండితెరకు హిట్ ఫార్ములా 'పునర్జన్మ'

Monday,May26th,2014, 05:20 AM

ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్లీ పుడతాడో లేదో కానీ, అది నిజమై తన గతం గుర్తుకు వస్తే దానంత సర్ ప్రైజ్ జీవితంలో ఇంకేమీ ఉండదు. నిజ జీవితంలో గత జన్మ తాలూకు జ్ఞపకాలు గుర్తుకు వచ్చాయని అక్కడక్కడ కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఆ వార్తలు ఎంతవరకూ నిజమన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. ఎందుకంటే గత జన్మ గుర్తుకు వచ్చిందని చెప్పిన వారందరూ సైకలాజికల్ గా బాధపడుతున్నవారేనని డాక్టర్లు పలుమార్లు నిరూపించారు. అలాగే, మళ్లీ జన్మించి, గత జన్మను గుర్తు చేసుకునేవాళ్లూ ఉండరు. ఇక, సినిమా పునర్జన్మల గురించి చెప్పాలంటే...

వెండితెరకిది హిట్ ఫార్మూలా...
వెండితెరపై 'పునర్జన్మ' హిట్ ఫార్మూలా. నిర్మాతలకు కాసులు కురిపించే ఫార్మూలా అనే చెప్పాలి. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకూ పునర్జన్మ పాయింట్ తో రూపొందించిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. మరీ ముఖ్యంగా స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారు పునర్జన్మ పాయింట్ తో చేసిన సినిమాలన్నీ హిట్ కావడం విశేషం. ఏయన్నార్ నటించిన ఈ చిత్రాలేంటో తెలుసుకుందాం.

అక్కినేని నాలుగు సినిమాలు...
ఎయన్నార్ హీరోగా నటించిన 'బాలరాజు' ఆయన కెరీర్ లో రూపొందిన తొలి పునర్జన్మ చిత్రం. ఆ తర్వాత ఇదే తరహాలో సాగే 'మూగ మనసులు' చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పునర్జన్మ పాయింట్ తో రూపొందిందే. ఈ సినిమా తర్వాత 'బంగారు బొమ్మలు' అనే టైటిల్ తో పునర్జన్మ పాయింట్ తో మరో సినిమా చేసారు నాగేశ్వరరావు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా తన వారసులు నాగార్జున, నాగచైతన్యతో కలిసి 'మనం' టైటిల్ తో పునర్జన్మ పాయింట్ తో సినిమా చేసారు ఏయన్నార్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆయనకు చివరి చిత్రం అయ్యింది.

రాజమౌళి కూడా హిట్ కొట్టాడు...
పునర్జన్మ పాయింట్ తో సంచలన దర్శకుడు రాజమౌళి 'మగధీర' సినిమా చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించాడు. నిజం చెప్పాలంటే రామ్ చరణ్ రెండో సినిమా ఇది. కానీ రెండో సినిమాకే రామ్ చరణ్ కి స్టార్ హీరో రేంజ్ ని తెచ్చి పెట్టింది 'మగధీర'. ఇక రాజమౌళిని అయితే మరో మెట్టు పైకి ఎక్కించిన చిత్రం 'మగధీర'. సో... రాజమౌళి కి కూడా పునర్జన్మ పాయింట్ వర్కవుట్ అయ్యింది.

సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నవ్వులపాలు...
పునర్జన్మ పాయింట్ ని సరిగ్గా వెండితెరపై ఆవిష్కరించలేకపోతే నవ్వులపాలు అయ్యే అవకాశం ఉంది.  సినిమా ఏ మాత్రం బాగోలేకపోయినా, పిచ్చి సినిమా తీసాడు డైరెక్టర్ అని ప్రేక్షకులు తిరస్కరించేస్తారు. ఇలాంటి పాయింట్ తో సినిమాలు తీయాలంటే... ముందు కథను కన్ ప్యూజ్ లేకుండా చెప్పగలగాలి. నమ్మదగిన విధంగా సీన్స్ ఉండాలి. నటీనటుల ఎంపిక విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రెండు జన్మలను చూపించేటప్పుడు అప్పటి పరిస్ఙితులను, జీవన ప్రమాణాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆర్ట్ డైరెక్టర్ నుంచి, సంగీత దర్శకుడు, కెమెరా మేన్ వరకూ వీటిన్నంటినీ పూర్తిగా స్టడీ చేయగలిగితేనే, ఎలాంటి లోపాలు లేకుండా సినిమా చేయగలుగుతారు. ఆ రకంగా ఆనాడు 'మూగ మనసులు' ను డైరెక్ట్ చేసిన ఆదుర్తి సుబ్బారావు నుంచి ఈనాడు 'మనం'  డైరెక్ట్ చేసిన విక్రమ్ కుమార్ వరకూ 'పునర్జన్మ' పాయింట్ ని పర్ ఫెక్ట్ గా డీల్ చేసిన వారే అని చెప్పొచ్చు.

సో... కరెక్ట్ గా డీల్ చేస్తే... పునర్జన్మ పాయింట్ ఎప్పటికీ వెండితెరకు హిట్ ఫార్మూలానే అని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే ఫార్మూలానే అని ఒప్పుకోక తప్పదు. పునర్జన్మ కథలలో హీరోగా నటించి, మెప్పించిన మన అభిమాన హీరో ఏయన్నార్ మళ్లీ పుడితే ఎంత బాగుంటుందో... ఆ ఊహే అక్కినేని అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !