తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టైల్ లో నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ 'మేజర్ చంద్రకాంత్', 'అడవిలో అన్న' వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు.
2004లో విడుదలైన 'దొంగ దొంగది' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పాండవులు పాండవులు తుమ్మెద, కరెంట్ తీగ, దొంగాట, శౌర్య, ఎటాక్, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమాలు చేసారు. ప్రతి సినిమాలోనూ విలక్షణమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన మనోజ్ రాకింగ్ స్టార్ ఇమేజ్ తో ముందుకు దూసుకెళుతున్నారు.
బిందాస్ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం 'అహం బ్రహ్మసి' సినిమాతో బిజీగా ఉన్న మనోజ్, తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై కూడా వర్కవుట్ చేస్తున్నారు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు మరో రెండు, మూడు వారాల్లో తెలియజేయడానికి మనోజ్ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.
డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ ఈ తరం యంగ్ హీరోస్ లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు ఈ రోజు (మే 20). ఇలాంటి పుట్టినరోజులను ఆయన మరిన్ని జరుపుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఫిల్మీబజ్ డాట్ కామ్ టీమ్ కోరుకుంటోంది.