View

2015 టాప్ 5 డిజాస్టర్ చిత్రాలు.. మెగా, అక్కినేనికి షాక్!

Thursday,December31st,2015, 04:32 AM

ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా టాలీవుడ్ లో సినిమాల సందడి అంబరాన్ని అంటింది. వారానికో సినిమా, ఆ సినిమా ఎలా ఉంటుందోననే ముచ్చట్లతో సినీ ప్రియులకు బాగానే టైమ్ పాస్ అయ్యింది. బ్లాక్ బస్టర్, హిట్, ఫ్లాప్, యావరేజ్, అబౌవ్ యావరేజ్, డిజాస్టర్ సినిమాలు ప్రతి యేడాది ఉంటాయి. ఈ యేడాది కూడా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను ఇచ్చిన టాలీవుడ్, డిజాస్టర్ చిత్రాలను ఇచ్చింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన రాంచరణ్ కి 'బ్రూస్ లీ' ద్వారా , అక్కినేని వారసుడు అఖిల్ కి 'అఖిల్' ద్వారా గట్టి షాక్ ని ఇచ్చింది 2015. ఈ యేడాది టాప్ 5 డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల వివరాల్లోకి ఓ లుక్ వేద్దాం.


అఖిల్
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అయిన 'అఖిల్' చిత్రం ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ అఖిల్ తొలి సినిమా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆరంభమయ్యింది. ఈ సినిమాని హీరో నితిన్ నిర్మించడం విశేషం. భారీ బడ్జెట్ తో, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మాస్ ని టార్గెట్ చేస్తూ వినాయక్ చేసిన ఈ చిత్రం అందరికీ గట్టి షాకిస్తూ ఫ్లాప్ అవ్వడం టాలీవుడ్ ని షేక్ చేసింది. అఖిల్ కొత్త రికార్డులను సృష్టిస్తాడని, బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందని అక్కినేని అభిమానులు, ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ లెక్కలు తారుమారు చేస్తూ నిర్మాత, పంపిణీదారులను నిరాశపరిచింది. ప్రీ రిలీజ్ బాగా జరిగి అందరి దృష్టి ఈ సినిమా వైపు పడేలా చేసింది. విడుదలైన తొలి రోజు తొలి షో భారీ ఓపినింగ్స్ తో ఆరంభమయ్యింది. కానీ యునానిమస్ ఫ్లాప్ టాక్ రావడంతో, ఆ ప్రభావం వసూళ్లపైన చూపించడం రెండో రోజే విడుదలైన అన్ని ఏరియాల నుంచి నెగటివ్ రిపోర్ట్ రావడం జరిగిపోయింది. అక్కినేని ఫ్యామిలీకి గట్టి షాకిచ్చింది ఈ చిత్రం. అఖిల్ కూడా నిరాశపడిపోయాడు. ఈ సినిమా ఫ్లాప్ ని తన నెత్తి మీద వేసుకున్నాడు వినాయక్. ఏదేమైనా అక్కినేని అఖిల్ తొలి చిత్రం రిజల్ట్ ఇలా అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది.


బ్రూస్ లీ
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బ్రూస్ లీ'. ష్యూర్ షాట్ విన్నర్ అని ప్రతి ఒక్కరూ భావించిన చిత్రం ఇది. కానీ అందరి అంచనాలను వమ్ము చేస్తూ డిజాస్టర్ చిత్రంగా మిగిలిపోవడం టాలీవుడ్ ని షాక్ కి గురి చేసింది. విశేషమేంటంటే... చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. దాంతో మెగాభిమానులు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, సినిమా బాగోలేకపోవడం చిరు గెస్ట్ అఫియరెన్స్ కి ప్రత్యేకత లేకుండా చేసింది. శ్రీను వైట్ల కెరియర్ ని ఈ చిత్రం టోటల్ గా అయోమయంలో పడేసింది. మెగా ఫ్యామిలీని నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత రాంచరణ్ తన తదుపరి చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్లలు తీసుకుంటున్నాడని సమాచారమ్. అంతలా ఈ సినిమా ప్రభావం చూపించింది.


కిక్ 2
మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం 'కిక్ 2'. రవితేజ 'కిక్' భారీ విజయాన్ని చవిచూసిన నేపధ్యంలో 'కిక్ 2' పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ స్ర్కీన్ ప్లే విషయంలో జరిగిన తప్పు ఈ సినిమాని బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా నమోదయ్యేలా చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి షోకే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోవడం తొలి రోజు వసూళ్ల మీద ప్రభావం చూపించింది. సినిమా విడుదలకు ముందు ట్రిమ్ చేయమని సురేందర్ రెడ్డికి రవితేజ, కళ్యాణ్ రామ్ చెప్పినప్పటికీ వినలేదని సమాచారమ్. నిజంగానే ప్రేక్షకులు సెకండాఫ్ ని భరించలేకపోయారు. ఫలితం డిజాస్టర్. చాలా ఈజీగా బాక్సాపీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచిపోతుందని అందరూ భావించిన చిత్రం ఇది. కానీ అలా జరగలేదు. రవితేజతో పాటు కళ్యాణ్ రామ్ ని కూడా విపరీతంగా నిరాశపరిచిన చిత్రం ఇది.


రేయ్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ వై.వి.యస్ చౌదరి స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'రేయ్'. సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం ఇదే అయినప్పటికీ ఈ సినిమా నిర్మాణ విషయంలో జరిగిన జాప్యం వల్ల సాయిధరమ్ తేజ్ రెండో చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం' విడుదలయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో 'రేయ్' చిత్రం విడుదలకు రూటు క్లియర్ అయ్యింది. కానీ బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ చిత్రంగా నమోదయ్యింది. 'పిల్లా నవ్వులేని జీవితం' తో హిట్ అందుకున్నాడు కాబట్టి, సాయిధరమ్ తేజ్ పై 'రేయ్' ఎఫెక్ట్ పడలేదుగానీ, వై.వి.యస్ చౌదరి కెరియర్ పై చాలా ప్రభావం చూపించింది. బయ్యర్స్ బాగా నష్టపోయారు. మొత్తం మీద 'రేయ్' అందరికీ గట్టి షాక్ ఇచ్చింది.


శివం
ఎనర్జిటిక్ హీరో రామ్ చాలా కాన్ఫిడెంట్ గా చేసిన చిత్రం 'శివం'. డైరెక్టర్ సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరియం అయ్యారు. రిలీజ్ ఫర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసినప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సినిమా రామ్ ని చాలా నిరాశపరిచింది.


ష్యూర్ షాట్ హిట్ గా భావించిన ఈ 5 చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచి అందరినీ నిరాశపరిచాయి. భారీ నష్టాలను చవిచూసేలా చేసాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !