సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెలుగు సినిమాతో భారీ విజయాన్ని అందుకుని క్రేజ్ తెచ్చుకున్న సక్సెస్ ఫుల్ కాంబినేషన్ టాలీవుడ్ లో మళ్లీ రిపీట్ అవ్వబోతోందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆ కాంబినేషన్ వివరాల్లోకి వెళితే...
మాస్ మహారాజా రవితేజ హీరోగా "రాజా ది గ్రేట్" చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని టాలీవుడ్ టాక్. వచ్చే యేడాది రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారమ్. ఈ సినిమా "రాజా ది గ్రేట్" చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది.