పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమాతో పాటు తాజాగా మరో సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. యువి క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఫ్యామిలీ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కనుందని, వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారమ్. ఈ ప్రాజెక్ట్ కనుక సెట్స్ పైకి వెళితే... నిజంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్దమైనట్టేనని చెప్పొచ్చు.