View

ఇంటర్య్వూ - డైరెక్టర్ రాకేష్‌ ఉప్పలపాటి (నేను స్టూడెంట్ సార్)

Saturday,May27th,2023, 01:35 PM

‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్' తో థ్రిల్  ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు రాకేష్‌ ఉప్పలపాటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


మీ నేపథ్యం గురించి చెప్పండి ?
మాది భీమడోలు పక్కన యం.నాగులపల్లి. నాన్న గారు వ్యాపారం నిమిత్తం డైరెక్టర్ సుకుమార్ గారి వూరు పక్కన వున్న తాటిపాకకు మారాం. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గోగినేని శ్రీనివాస్ గారి ప్రొడక్షన్ లో ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ అనే సినిమాకి పని చేశాను. అక్కడ ఆనంద్ అనే కోడైరెక్టర్ తేజ గారికి పరిచయం చేశారు. అప్పటి నుంచి అహింస స్క్రిప్ట్ వరకూ తేజ గారితోనే జర్నీ చేశాను.


‘నేను స్టూడెంట్ సార్' మీ సొంత కథ ?
ఈ చిత్రానికి కృష్ణ చైతన్య గారు కథ అందించారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారి కోసం నేను ఒక కథ చెప్పాను. దాని మేకింగ్ వీడియో కూడా చేశాను. సతీష్ గారు, సురేష్ గారికి చాలా నచ్చింది. ఇదే సమయంలో గణేష్ కోసం ఓ కథ చుస్తున్నారు. కృష్ణ చైతన్య గారు చెప్పిన కథ వారికి నచ్చింది. అయితే అప్పటికే ఆయన నితిన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ కథని నేను బాగా తీయగలనని సతీష్ గారు, సురేష్ గారు భావించడంతో దర్శకుడిగా ప్రాజెక్ట్ లోకి వచ్చాను.  


‘నేను స్టూడెంట్ సార్’ కథ ఎలా వుంటుంది ?
ఇది థ్రిల్లర్. కథ గురించి ఏం చెప్పినా సస్పెన్స్ రివిల్ అయిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఇష్టమైన ఫోన్, అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్.. ఈ మూడింటి చుట్టూ కథ వుంటుంది. హీరోకి కమీషనర్ కి వార్ ఎలా వచ్చిందనేది చాలా ఆసక్తికరంగా వుంటుంది. ప్రతి ముఫ్ఫై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది. సినిమా రెండు గంటల ఏడు నిమిషాలు వుంటుంది. ఇందులో మీరు ఎండ్ ని, విలన్ ని, కథ ఏ స్వరూపం లోకి వెళుతుందో అనేది ఊహించలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.


హీరోయిన్ ఛాయిస్ ఎవరిది ?
హీరోయిన్ విషయంలో చాలా ఆప్షన్లు వచ్చాయి. భాగ్యశ్రీ గారు హిందీ ఛత్రపతి లో శ్రీనివాస్ గారి మదర్ గా చేశారు. వాళ్ళ అమ్మాయిని తెలుగు  లో పరిచయం చేయాలనే ఆలోచన వుందని సురేష్ గారితో చెప్పారు.అలా అవంతిక ని చూశాం. ఈ పాత్రకు సరిపొతుందనిపించింది. భాగ్యశ్రీ గారి అమ్మాయి కావడంతో సినిమాకి కూడా హెల్ప్ అయ్యింది.


సముద్రఖని గారిని  తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ?
మొదట ఈ పాత్రకు గౌతమ్ మీనన్ అనుకున్నాను. ఐతే సతీష్ గారు సముద్రఖని గారి పేరుని సూచించారు. ఐతే ఫైనల్ చాయిస్ మాత్రం నాకే వదిలేశారు. ఎందుకో సముద్రఖని గారు ఈ పాత్రకు అన్ని విధాలా బావుంటారనిపించింది. సముద్రఖని గారు మీడియం రేంజ్ సినిమాలు పెద్దగా చేయరు. ఈ సినిమా చేయడానికి కారణం.. సముద్రఖని గారు తీసిన శంభో శివ శంభో సినిమాని సురేష్ గారు ప్రోడ్యుస్ చేశారు. సురేష్ గారు ఇచ్చిన రెమ్యునిరేషన్ తోనే సముద్రఖని గారు ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పటికే అదే ఇంట్లో వుంటున్నారు. ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళిన సురేష్ గారే గుర్తుకు వస్తుంటారు, వాళ్ళ అబ్బాయి సినిమా ఖచ్చితంగా చేయాలని ఆయన ఈ సినిమా చేశారు. కథ కూడా ఆయనకి చాలా నచ్చింది. షూటింగ్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు.


తేజ గారి నుంచి ఏం నేర్చుకున్నారు ?
తేజ గారు ఊటబావి లాంటి వ్యక్తి. ఆయన నుంచి నేర్చుకొని డైరెక్షన్ చేయాలంటే చేయలేం. ప్రతిరోజు కొత్తగా ఆలోచిస్తారు. కొత్త కోణంలో మాట్లాడతారు. ఆయన దగ్గర పూర్తిగా నేర్చుకున్నాను అని చెప్పలేను. కానీ చాలా నేర్చుకున్నాను.


ఈ సినిమా జర్నీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకున్నారు ?
థ్రిల్లర్ అనేసరికి ఒక మూడ్ లో తీస్తారు. నేను దాన్ని బ్రేక్ చేస్తూ కమర్షియల్ కోణంలో తీశాను. అది సక్సెస్ అయ్యిందనే నమ్ముతున్నాను. సినిమా అంతా యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నడుస్తుంది.


మహతి స్వరసాగర్ మ్యూజిక్  గురించి ?
ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేపధ్య సంగీతం మాత్రం నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. జాన్ విక్, విక్రమ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆర్ఆర్ కి కాళ్ళు కదపకుండా ఉండలేరు. అంత అద్భుతంగా చేశారు.


ఈ సినిమా టైటిల్ ఆలోచన ఎవరిది ?
ఈ సినిమాకి మొదట రింగ్ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. ఐతే రింగ్ అంటే.. ఏ రింగ్  ? అనే ప్రశ్నలు వచ్చాయి. తర్వాత కొన్ని టైటిల్స్ పరిశీలించాం. సతీష్ గారు ఇందులో వున్న డైలాగ్ ప్రకారం .. ‘నేను స్టూడెంట్’ అన్నారు. దీనికి నేను ‘సార్’ అని యాడ్ చేశాను. నేను స్టూడెంట్ క్రెడిట్ ఆయనదే.


మీకు ఇష్టమైన జోనర్ ?
పక్కా యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం.


తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నారు ?
మూడు పెద్ద కంపెనీల నుంచి కాల్స్ వచ్చాయి. అనుకున్నది అనుకున్నట్లుగా తీశానని సతీష్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి మూడు ప్రివ్యూలు వేశాం. అన్నిటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరో సినిమా చేస్తున్నామని సతీష్ గారు అడ్వాన్స్ ఇచ్చారు.


ఆల్ ది బెస్ట్
థాంక్స్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !