View

ఇంటర్య్వూ - హీరోయిన్ అవికా గోర్ (1920)

Monday,June19th,2023, 12:15 PM

లెజెండరీ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ సమర్పణలో ఆయన స్వీయ రచనలో రూపొందిన హారర్ మూవీ "1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్". అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్ పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్ డా. రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించారు. జూన్ 23న ఈ చిత్రం తెలుగు విడుదల కానున్న నేపధ్యంలో అవికా గోర్ ఈ చిత్ర విశేషాలని పంచుకున్నారు.


1920 తో బాలీవుడ్ లో మెయిన్ లీడ్ గా పరిచయం కావడం ఎలా అనిపిస్తుంది?
మహేష్ భట్, విక్రమ్ భట్ లాంటి  లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ తో పని చేయడం అనేది నా కల. ఈ చిత్రంతో అది ఇంత త్వరగా రావడం నా అదృష్టం. ఇది నా పై ఇంకా బాధ్యత పెంచింది. ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. లుక్, ఎప్పిరియన్స్ ఇలా ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. మహేష్ భట్ గారు ఈ కథని అందించారు. ఒక యూనిక్ హారర్ సినిమా ఇది. వారి నిర్మాణంలో వచ్చే ప్రతి సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ఈ చిత్రం కోసం చాలా ఎక్సైటింగ్ ఎదురుచూస్తున్నాను.


హారర్ సినిమాలో చేయడం ఎలా అనిపించింది ?
నాకు హారర్ సినిమాలు చూడటం ఇష్టమే. భయపడుతూ చూస్తాను(నవ్వుతూ). రాజుగారి గది3 హారర్ కామెడీ. కాని 1920 సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి హారర్ సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా మరిన్ని హారర్ కథల కోసం సంప్రదిస్తారని భావిస్తున్నాను.


మీ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు ?
నేను నిజ జీవితంలో ఎలా ఉంటాను, ఎలా మాట్లాడతానో అలా ఉంటే సరిపొతుందని దర్శకురాలు చెప్పారు. ఐతే ఈ సినిమా షూటింగ్ మాత్రం నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్ రియల్ ఇంజిన్ ఎల్ ఈ డీ స్క్రీన్) వాడాం. దాని కోసం ఎక్కువగా ప్రిపేర్ కావాల్సి వచ్చింది. చాలా భాగం షూటింగ్ స్టూడియోస్ లో జరిగింది. టెక్నికల్ గా చాలా డిఫరెంట్ మూవీ ఇది.


మహేష్ భట్, విక్రమ్ భట్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
మహేష్ భట్, విక్రమ్ భట్ గారు అద్భుతమైన వ్యక్తులు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద, ఆప్యాయత ఇస్తారు. కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. వారితో మాట్లాడుతునప్పుడు ఒక కుటుంబ సభ్యునితో మాట్లాడుతున్నట్లే వుంటుంది. నాగార్జున గారిలో కూడా ఈ క్వాలిటీ చూశాను. ఆ క్వాలిటీ వారి నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి.


నాగార్జున గారు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం ఎలా అనిపించింది ?
నాగార్జున గారు నా మొదటి సినిమా నుంచి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఆయన నా లక్కీ చార్మ్. మొన్న నన్ను పాన్ వరల్డ్ స్టార్ అని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో చెప్పిన మాట అది. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.


1920 లో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలు ఏమిటి ?
1920 కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హారర్ కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కూడా వుంది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.


కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
తెలుగు లో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ‘ఇందు’అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. అలాగే ఆది సాయి కుమార్ తో ‘అమరన్’ మొదలౌతుంది.  


ఆల్ ది బెస్ట్
థాంక్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !