View

ఇంటర్య్వూ - హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ( స్పై)

Sunday,June25th,2023, 03:45 PM

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై' తో వస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో  నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ విలేకరుల సమావేశంలో 'స్పై' విశేషాలని పంచుకున్నారు.  


స్పై ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
ఇది నా మొదటి తెలుగు సినిమా. నిజంగా డ్రీమ్ డెబ్యు. దర్శకుడు గ్యారీ బిహెచ్ ఈ సినిమా సైన్ చేసినపుడే నన్ను హీరోయిన్ గా అనుకున్నారు. నేరుగా వచ్చి కథ చెప్పారు. కథ విని చాలా థ్రిల్ అయ్యాను.  ఇందులో నాది చాలా ఇంటెన్స్ రోల్. మరో ఆలోచన లేకుండా సైన్ చేశాను. స్పై .. ఎక్సయిటింగ్ యాక్షన్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది.


మీ పాత్ర యాక్షన్ కోణంలో ఉంటుందా ?
ఇందులో నా పాత్రకు చాలా కోణాలు వుంటాయి. యాక్షన్, స్టంట్స్ అన్నీ వుంటాయి. రా ఏజెంట్ గా కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. యాక్షన్,  గన్ షూటింగ్ లో  దాదాపు ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. నిజంగా ఇది చాలా ఎక్సైటింగ్ జర్నీ. ఈ పాత్ర  చేసే క్రమంలో 'రా' గురించి చాలా నేర్చుకున్నాను. ఎలాంటి గుర్తింపుని ఆశించకుండా దేశానికి సేవ చేస్తుంటారు. అలాగే ఈ సినిమా యాక్షన్ విషయంలో నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. ఇకపై యాక్షన్ పాత్రలు వస్తే చాలా కాన్ఫిడెంట్  గా  చేస్తాననే నమ్మకం వుంది. స్పై కి పార్ట్ 2 చేసే స్కోప్ వుంది. ఒకవేళ అది జరిగితే అందులోనూ నేనే హీరోయిన్ గా ఉండాలనేది నా కోరిక.(నవ్వుతూ)


నిఖిల్ తో పని చేయడం ఎలా అనిపించింది ?  
నిఖిల్ బ్రిలియంట్ యాక్టర్. హ్యాపీ డేస్ నుంచి ఆయన వర్క్ ని చూస్తున్నాను. ఆయన కథల ఎంపిక చాలా బాగుంటుంది. తను చాలా పాజిటివ్ పర్సన్ . చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు.


స్పై మ్యూజిక్ గురించి చెప్పండి ?
శ్రీచరణ్ పాకాల గారు నేపధ్య సంగీతం తో పాటు తూ ముజే ఖూన్ ధో పాట చేశారు, అలాగే విశాల్ చంద్రశేఖర్ గారు రెండు పాటలు చేశారు. స్పై మ్యూజిక్ ఎక్స్ట్రార్డినరి  గా  వుంటుంది.  


స్పై షూటింగ్ లో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
నేను ఇది వరకు యాక్షన్ సినిమాలు చేయలేదు. రా ఏజెంట్ గా కనిపించడం అంటే దానికి   ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మన కదలిక, యాక్షన్, ఫైట్. యాటిట్యూడ్ అన్నీ రా ఏజెంట్ లా సహజంగా ఉండేలా చూసుకోవడం ఛాలెంజింగ్ గా అనిపించింది.  ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.


మీ సినిమా ప్రయాణం ఎలా జరిగింది ?
ఇప్పటివరకూ  ప్రయాణం చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇంజనీరింగ్ చేశాను. నేను ఎప్పుడూ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. ఆరంభంలో చిన్న చిన్న యాడ్స్ చేశాను. ఒకొక్క అడుగువేసి ఇక్కడి వరకూ వచ్చాను. ఈ ప్రయాణం చాలా ఆనందాన్ని ఇస్తోంది.


మీ డ్రీమ్ రోల్స్ ఏంటి ? మీ ఫేవరేట్ హీరో ఎవరు ?
చాలా డ్రీమ్ రోల్స్ వున్నాయి. అలియా భట్ చేసిన హైవే తరహ పాత్రలు పోషించాలని వుంది. నాకు అందరి హీరోలతో వర్క్ చేయాలని వుంటుంది.


ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి ?
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా చేస్తున్నా.


ఆల్ ది బెస్ట్
థాంక్స్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !