View

ఇంటర్య్వూ - హీరో సుధాకర్ కోమాకుల (నారాయణ అండ్ కో)

Wednesday,June28th,2023, 01:27 PM

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో హీరో సుధాకర్ కొమాకుల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


ఈ సినిమా కి హీరోతో పాటు నిర్మాతగా చేయడానికి కారణం ?
నాకు నిర్మాణంపై ఎప్పటి నుంచో ఆసక్తి వుంది. బిజినెస్ పరంగా కాదు కానీ ఏదైనా క్రియేటివ్ గా ప్రోడ్యుస్ చేయడం అంటే ఇష్టం.  మొదటి నుంచి వీడియోస్, కవర్ సాంగ్స్ చేస్తూనే వున్నాను. సినిమా నిర్మాణంలోకి రావలనుకున్నపుడు ఇది మంచి ఛాయిస్ అనిపించింది. దీనికంటే ముందు రీసెట్ అనే సినిమా మొదలుపెట్టాం. అది ఇంకా టేకాఫ్ కాలేదు. ఈలోగా ‘నారాయణ అండ్ కో’ వచ్చింది.


‘నారాయణ అండ్ కో’ లో మీకు నచ్చిన అంశం ఏమిటి ?
చిన్నా ఈ కథ చెబుతున్నపుడు చాలా గమ్మత్తుగా అనిపించింది. ఏం చేసిన ఫ్యామిలీ అంతా చేస్తారని చెప్పడం చాలా కొత్తగా హిలేరియస్ గా అనిపించింది. ఇది ఫ్యామిలీ మూవీ. ఇలాంటి సినిమాతో నిర్మాణంలోకి రావడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అంతా చాలా ఫన్ గా వుంటుంది. ఫ్యామిలీ అండ్ క్రైమ్ కామెడీ రెండూ వుంటాయి.


దేవి ప్రసాద్ గారి ఛాయిస్ ఎవరిది ?
ఈ కథ విన్న తర్వాత టైటిల్ అడిగాను. ‘నారాయణ అండ్ కో’ అని చెప్పారు. చాలా నచ్చింది. ఇందులో తండ్రి పాత్రకు ఎవరిని తీసుకోవాలని అలోచిస్తున్నప్పుడు దేవి ప్రసాద్ గారి పేరు చెప్పాను. ఆయన  సీరియస్ రోల్స్ చేసినా మంచి కామెడీ సినిమాలు తీశారు. అలాగే బయట ఆయన చాలా సరదాగా ఉంటారు.  ఈ పాత్రకు ఆయనైతే పర్ఫెక్ట్ అనిపించింది.


ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో  నారాయణ గారి అబ్బాయి పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చాలా సహజంగా సెటిల్డ్ గా వుంటుంది . నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు కామెడీ చాలా ఇష్టం. ఇందులో ఫుల్ లెంత్ వినోదం చేసే అవకాశం దక్కింది. చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో అమాయకత్వం నుంచే పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమా కోసం చాలా విషయాలు కొత్తగా ప్రయత్నించాం. ఇందులో నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. అలాగే ఈ చిత్రానికి మహిళా ఎడిటర్ సృజన అడుసుమల్లి పని చేశారు. చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. దేవి ప్రసాద్, ఆమనీ గారు ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ చేశారు. ఇందులో చాలా ఫన్ తో కూడిన పాత్రలు చేశారు. అలాగే మా తమ్ముడు పాత్ర చేసిన జై కృష్ణ పాత్ర కూడా బాగుంటుంది. అలాగే పూజా కిరణ్ తెలుగమ్మాయి. ఆర్తి, సప్తగిరి, అందరూ చాలా చక్కగా నటించారు. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.


ఈ కథ కల్పితమా ? యధార్థ సంఘటనల స్ఫూర్తి ఉందా ?
ఈ కథ కల్పితమే. రవి గోలి రాశారు. ఆయన నాగ్ అశ్విన్ టీంలో పని చేశారు.


మీకు  రచనపై ఆసక్తి వుందా ?
సినిమా బాగా రావాలంటే ఏం చేయొచ్చు అనేది అలోచిస్తాను. మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చినపుడు అన్నిట్లో కొంచెం ప్రవేశం వుండాలి. మొదట కోరియోగ్రఫీ చేశాను. తర్వాత ఫోటోగ్రఫీ చేశాను. ఇలా కొన్ని క్రాఫ్ట్ ల పై అవగాహన వుంది. ఇందులో మాత్రం చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది.


ఈ జర్నీ లో రావాల్సినంత ఫేం వచ్చిందని అనుకుంటున్నారా ?
లేదండీ. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత మరో సోలో సినిమా పడుంటే నెక్స్ట్ లెవల్ లోకి వెళ్ళేది. ఐతే చేయాల్సిన కొన్ని ప్రాజెక్ట్స్ మొదలుకాలేదు. నేను మాత్రం ప్రయత్నిస్తూనే వున్నాను. ఏ  కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేసినా మొదటి సినిమాలానే ఫీలవుతున్నాను.


అనిల్ రావిపూడి సినిమాల్లో మిమల్ని అడగలేదా ?
అనిల్ మంచి ఫ్రండ్. తనకి నాకు మంచి పాత్ర ఇవ్వాలని వుంటుంది. అలాంటిది ఇంకా కుదరలేదు.


క్రాక్ తర్వాత అలాంటి పాత్రలు వచ్చాయా ?
వచ్చాయి కానీ నేనే ఆసక్తి చూపలేదు. లీడ్ రోల్స్ పైనే దృష్టి పెట్టాను. దర్శకత్వం పై ఆసక్తి వుంది ఐతే అది ఇప్పుడే కాదు. దానికి చాలా సమయం వుంది.


మీ డ్రీమ్ రోల్ ఏమిటి ?
నాకు బాక్సింగ్ యాక్షన్, డ్యాన్స్ నేపథ్యంలో వుండే సినిమాలు చేయాలని వుంది. అలాగే ఎమోషనల్ సినిమాలు కూడా ఇష్టం. త్వరలో ఒక ఎమోషనల్ రోల్ వున్న సినిమా చేస్తున్నాను. అలాగే గుండెల్లో దమ్ము అనే సినిమా చేస్తున్నాను. అది ఫౌండ్ ఫుటేజ్ ఫార్మేట్ లో షూట్ చేశాం. 1980 నేపథ్యంలో ఒక లవ్ స్టొరీ కూడా వుంది. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.  


ఆల్ ది బెస్ట్
థాంక్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !