View

ఇంటర్య్వూ - రామ్ పోతినేని 'స్కంద' 

Saturday,September23rd,2023, 04:41 PM

ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో తన పాత్రలకు రామ్ స్వయంగా డబ్బింగ్ చెబుతారు. మరి, హిందీలో? ఆయనకు సంకేత్ మాత్రే డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో డబ్బింగ్ అయ్యే హాలీవుడ్ హీరోలకు, తెలుగు నుంచి అల్లు అర్జున్‌కు కూడా ఆయన డబ్బింగ్ చెబుతున్నారు. ఈ నెల 28న 'స్కంద' పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో రామ్ పోతినేనిని సంకేత్ మాత్రే ఇంటర్వ్యూ చేశారు.


*సంకేత్ మాత్రే : మిమ్మల్ని (రామ్) కలవడం చాలా సంతోషంగా ఉంది. మీతో ఇలా మాట్లాడటం, కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను!
*రామ్ పోతినేని : మిమ్మల్ని కలవడం నాకూ సంతోషంగా ఉంది. నాకు డబ్బింగ్ విలువ తెలుసు. తెలుగులో చెబుతున్నాను కదా! డబ్బింగ్ కారణంగా పెర్ఫార్మన్స్ ఎలివేట్ అవుతుంది.సంకేత్ : థాంక్యూ సార్! మీ మాటలు వాయిస్ ఆర్టిస్టులకు బూస్ట్ ఇస్తాయి. 


*సంకేత్ : సార్... స్క్రీన్ మీద మీరు కనిపిస్తారు. కానీ, వాయిస్ వేరొకరిది ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది?
*రామ్ : నా వాయిస్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. నాకు మొదట హిందీ డబ్బింగ్ మార్కెట్ మీద అంత అవగాహన లేదు. నేను 2016లో ముంబై వెళ్ళా. ఎయిర్ పోర్టులో 55, 60 ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తి వచ్చి నా నటన గురించి, సినిమా గురించి చెబుతున్నారు. 'మీకు నేను ఎలా తెలుసు?' అని అడిగా. ఏదో టైటిల్ చెప్పారు. సారీ, ఆ సినిమా కాదని చెప్పేశా. నేను తెలుగు హీరోనని చెప్పా. నన్ను వేరే హీరో అనుకుంటున్నారని అన్నాను. ఆయనేమో మీ సినిమాలు చూశానని చెబుతున్నాడు. తర్వాత హిందీలో నా సినిమా డబ్బింగ్ అయితే చూశారని తెలిసింది. తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తే కొంత మంది చూస్తున్నారని అర్థమైంది. 


*సంకేత్ : కొందరు కాదు సార్! చాలా మంది చూస్తున్నారు. మీ సినిమాలకు హిందీలో 200, 300 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఐ ఫోన్ కొత్త మోడల్ ఎప్పుడు వచ్చినా సరే 'ఇస్మార్ట్ శంకర్'లో డైలాగ్ వైరల్ అవుతుంది.
*రామ్ : తెలుగులో ఆ డైలాగ్ లేదు. హిందీలో యాడ్ చేశారు. నేను ఆ క్లిప్ పూరి జగన్నాథ్ గారికి పంపించా. ఎలా ఇంప్రవైజ్ చేశారో చూడమని చెప్పా. నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది. సంకేత్ : కొన్నిసార్లు రైటర్స్, కొన్నిసార్లు వాయిస్ ఆర్టిస్ట్స్... ఆ ఇంప్రవైజ్ వెనుక టీమ్ వర్క్ ఉంటుంది. 'స్కంద'లో కూడా అటువంటి ప్రయోగం ఒకటి చేశాం. 'మేరే పంచ్ కా సౌండ్ ఛార్మినార్ తక్ జయేగా! ఔర్ తేరే చీక్ లాల్ ఖిలే తక్' అని ఓ డైలాగ్ మార్చి చెప్పాం.   


*సంకేత్ : 'స్కంద' విషయానికి వస్తే... ట్రైలర్ సూపర్ హిట్! డైలాగ్స్ కూడా బావున్నాయి. మీకు ఇష్టమైన డైలాగ్ ఏది?
*రామ్ : నాకు ఇష్టమైన డైలాగ్స్ అన్నీ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో తెలుగు నేటివిటీతో కూడిన డైలాగ్ ఒకటి ఉంది. హిందీలో ఆ డైలాగ్ ఎలా రాశారో చూడాలని వెయిట్ చేస్తున్నా. 


*సంకేత్ : మీ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఇది. ఎలా ఉంది?

*రామ్ : చాలా మంది రిలీజ్ గురించి అడుగుతున్నారు. ఇది బాలీవుడ్ సినిమా అంటున్నారు. ఒక్కటి చెప్పాలి... 'స్కంద' బాలీవుడ్ సినిమా కాదు, తెలుగు సినిమా! మేం తెలుగులో తీశాం. హిందీ ప్రేక్షకులు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మేం థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం సినిమాలు తీస్తాం. యూట్యూబ్, మొబైళ్లలో కాకుండా హిందీ ప్రేక్షకులకు కూడా ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని 'స్కంద'ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. 


*సంకేత్ : మీరు ఇటీవల షారుఖ్ ఖాన్ గారిని కలిశారని విన్నా! 'జవాన్' చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు 'స్కంద' ట్రైలర్ చూశారు. షారుఖ్ ని కలిసినప్పుడు ఎలా అనిపించింది?
*రామ్ : ఆయనను కలిసిన మరుక్షణం నుంచి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకు అట్లీ, ప్రియా మంచి ఫ్రెండ్స్. షారుఖ్ గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నా సినిమాల గురించి మాట్లాడారు. ట్రైలర్ పంపించమని అడిగారు. షారుఖ్ చాలా స్వీట్ హార్ట్! 


*సంకేత్ : 'స్కంద'కి డబ్బింగ్ చెప్పినప్పుడు ఫైట్స్ వచ్చేసరికి కట్ చేసేవారు. నాకు అవి చూడాలని అనిపించేది. వెండితెరపై చూస్తా. దర్శకుడు బోయపాటి గారు ఫైట్స్ తీయడంలో స్పెషలిస్ట్. ఆయనతో పని చేయడం ఎలా ఉంది?
*రామ్ : ఆయన తీసిన యాక్షన్ సీక్వెన్సుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. మేం 'స్కంద' క్లైమాక్స్ 24 రోజులు షూట్ చేశాం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు షూటింగ్ చేశాం. నేను యాక్షన్ ఫిలిమ్స్ చేశా. కానీ, ఇప్పటి వరకు ఈ టైప్ యాక్షన్ చేయలేదు. బోయపాటి గారు ఆయన హీరోలను ఎప్పుడూ గొప్పగా చూపిస్తారు. 


*సంకేత్ : మీకు హిందీ సినిమాలు అంటే ఎంత ఇష్టం? మీరు చూసిన మొదటి హిందీ సినిమా ఏది?
*రామ్ : మా తాతయ్య గారు ఆర్మీలో పని చేశారు. మా అమ్మ కశ్మీర్, అస్సాంలో పెరిగారు. ఇంట్లో ఎక్కువ హిందీ మాట్లాడతారు. ఇప్పటికీ మా అమ్మను మావయ్య 'దీదీ' అని పిలుస్తారు. నా చిన్నప్పటి నుంచి ఇంట్లో హిందీ పాటలు వింటూ పెరిగా. నా చిన్నపుడు 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే'లో 'తుఝే దేఖా...' ఫెవరేట్!


*సంకేత్ : మీకు ఇష్టమైన హిందీ హీరోలు ఎవరు?
*రామ్ : ఒక్కరు అని చెప్పలేను. షారుఖ్, సల్మాన్, ఆమిర్, హృతిక్... అందరూ ఇష్టమే. ఈ జనరేషన్ హీరోల్లో రణబీర్ కపూర్ ఇష్టం. 


*సంకేత్ : నేను కలిసి మొదటి హీరో మీరే! మరి, మీరు హిందీ హీరోల్లో ఫస్ట్ కలిసింది ఎవర్ని?
*రామ్ : సల్మాన్ ఖాన్ సార్! నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. 'రెడీ'లో జెనీలియాతో కలిసి నటించా. నాకు రితేష్, జెనీలియా మంచి ఫ్రెండ్స్. మేం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నాం. 'భాయ్ వస్తున్నారు' అని రితేష్ అన్నారు. నేను వెళ్తానని చెప్పా. రితేష్ ఒప్పుకోలేదు. పట్టుకుని ఆపాడు. 'రెడీ'ని హిందీలో సల్మాన్ రీమేక్ చేశారు. ఆయనకు నన్ను పరిచయం చేశాక... 'గుర్తున్నావు. 'రెడీ'లో బాగా చేశావ్' అన్నారు. మా స్రవంతి మూవీస్ సంస్థలో నేను చేసిన మొదటి సినిమా 'రెడీ'. అది సల్మాన్ ఖాన్ గారు రీమేక్ చేయడం సంతోషం అనిపించింది. 


*సంకేత్ : మీ 'కందిరీగ'ను వరుణ్ ధావన్ హిందీలో రీమేక్ చేశారు. ఆయన్ను కలిశారా?
*రామ్ : ముంబైలో 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ చేస్తున్నప్పుడు... నాలుగు నెలల క్రితం వరుణ్ ధావన్, నేను జింలో కలిశాం. వరుణ్ చాలా స్వీట్. 


*సంకేత్ : మీరు ఓ ఇండియన్ క్రికెటర్‌లా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా చూశారా?
*రామ్ : 'ఇస్మార్ట్ శంకర్' కోసం లుక్ డిసైడ్ చేశాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి ఈ కంపేరిజన్ ఎక్కువ వస్తోంది. 


*సంకేత్ : విరాట్ కోహ్లీలా ఉన్నారని చాలా మంది అంటుంటారు. ఒకవేళ ఆయన బయోపిక్ చేసే అవకాశం వస్తే?

*రామ్ : తప్పకుండా చేస్తా. విరాట్ బయోపిక్ అంటే ఎగ్జైటింగ్ కదా!   


*సంకేత్ : మీ సినిమాలకు హిందీలో వస్తున్న వ్యూస్ చూసి ఏమనిపిస్తుంది?
*రామ్ : మా టీమ్ నాకు షేర్ చేస్తుంటారు. కొన్నిసార్లు తెలుగులో ఈ సినిమా ఇంత హిట్ కాలేదని అనిపిస్తుంది. నాపై హిందీ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ మరింత బాధ్యత పెంచింది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !