View

ఇంటర్య్వూ - హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ (టైగర్ నాగేశ్వరరావు)

Saturday,October07th,2023, 03:12 PM

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్,  చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన గాయత్రి భరద్వాజ్ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు.


‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
2018 లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ గెలిచాను. తర్వాత ఓ ప్రాజెక్ట్ సైన్ చేశాను. కోవిడ్ కారణంగా ఆలస్యమౌతూ వచ్చింది. తర్వాత దిన్దొర పాటు మరో రెండు వెబ్ సిరీస్ లు చేశాను. ఒకరోజు వంశీ గారి నుంచి కాల్ వచ్చింది. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చెప్పారు. నా పోర్షన్ కి సంబంధించి దాదాపు మూడుగంటల నేరేషన్ ఇచ్చారు. ప్రతిది వివరంగా చెప్పారు. నా పాత్ర గురించి చెప్పినప్పుడు కనీళ్ళు వచ్చేశాయి. చాలా ఎమోషనల్ గా వుండే పోర్షన్ కూడా వుంది. కథలో చాలా ఎత్తుపల్లాలు వుంటాయి. ఎలా అయినా ఈ సినిమా చేయాలని భావించాను. ఈ పాత్ర కోసం దాదాపు అరవైమందిని ఆడిషన్స్ చేశారట. ఈ పాత్రకు నేను యాప్ట్ గా ఉంటానని వంశీ గారు భావించారు. రవితేజ గారి ప్రాజెక్ట్ లో భాగం కావడం చాలా అనందంగా అనిపించింది.


ఇందులో మీ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ?
ఇందులో నా పాత్ర పేరు మణి. విలేజ్ క్యారెక్టర్ లో టామ్ బాయ్ గా కనిపిస్తా. నా పాత్ర చాలా రా, రస్టిక్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటుంది. సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత.. డైరెక్టర్ వంశీ గారు.. విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేసిన ఓ రెండు హిందీ సినిమాలు చూడమని చెప్పారు. ఆ సినిమాలు చూసిన తర్వాత నా పాత్రని ఏ లెవల్ వరకూ తీసుకెళ్ళాలో ఒక అవగాహన వచ్చింది. 70-80 లో జరిగే కథ ఇది. ఇందులో నా ఎప్పిరియన్స్ గురించి మర్చిపోయాను. కేవలం పాత్రపైనే ద్రుష్టిపెట్టాను. ఈ విషయంలో దర్శకుడు వంశీ గారిని బలంగా నమ్మాను. రవితేజ గారు సెట్స్ లో చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు. చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు.


ఇందులో మీరు చేసిన మణి పాత్రకు, మీ రియల్ లైఫ్ పాత్రకు ఎలాంటి తేడాలు ఉంటాయి ?
పూర్తిగా రెండూ భిన్నమైన పాత్రలు. రియల్ లో నేను టామ్ బాయిష్ గా వుండను. అలాగే కొంచెం రిజర్వడ్ గా వుంటాను.    


రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
రవితేజ గారు మాస్ మహారాజా. సెట్స్ లో చాలా హిలేరియస్ అండ్ ఎనర్జిటిక్ గా వుంటారు. అదే సమయంలో చాలా సపోర్టివ్ గా వుంటారు. రవితేజ గారి కామిక్ టైమింగ్ అద్భుతం. రవితేజ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో నటించడం అదృష్టం  గా  భావిస్తున్నాను. ఆయన చాలా డౌన్ టు ఎర్త్. ఆయన నన్ను భరద్వాజ్ అని పిలుస్తారు. ఆయన థాట్స్ అన్నీ చాలా యంగ్, పాజిటివ్ గా వుంటాయి.  


తెలుగుని అర్ధం చేసుకోవడం లో ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నారు ?
వంశీ గారు మంచి హిందీ మాట్లాడతారు. అలాగే నాకు తెలుగు కోచ్ కూడా వున్నారు. ప్రతి డైలాగ్ వెనుక వున్న ఎమోషన్, మీనింగ్ సంపూర్ణంగా అర్ధమయ్యేలా చెబుతారు. నాకు తెలుగు చాలా వరకూ అర్ధమైపోతుంది. అలాగే వంశీ గారు.. నటిస్తున్నపుడు ఎమోషన్ పై ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పారు. అలాగే సెట్స్ లో అందరూ చాలా సపోరివ్ట్ గా వుండేవారు. అందరి సపోర్ట్ తో  లాంగ్వేజ్ బ్యారియర్ ని సులువుగానే అధిగమించాను.


మీ కుటుంబ నేపధ్యం గురించి ?
మాది ఢిల్లీ. మా నాన్న గారు పైలెట్, అమ్మ సైకాలజిస్ట్. ఎలాంటి సినిమా నేపధ్యం లేని కుటుంబం నుంచి వచ్చాను. అయితే ఇంట్లో చిన్నప్పటినుంచి ప్రతి విషయంలో ప్రోత్సహించేవారు. భరతనాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. కళలకు సంబధించిన ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ వరల్డ్ లో ఫేమస్ అవ్వాలని వుండేది.  


ఈ సినిమాకి ముందే స్టువర్ట్ పురం నాగేశ్వరరావు రియల్ స్టొరీ గురించి ఎప్పుడైనా విన్నారా ?
వంశీ గారు చెప్పేవరకూ తెలీదు. వంశీ చెప్పిన తర్వాత ఆయనది ఎంత ప్రత్యేకమైన కథో అర్ధమైయింది.  దొంగలు గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. ఐతే నాగేశ్వరరావు గురించి దేశం అంతా మాట్లాడుతుంది. ఆయన ఢిల్లీతో పాటు అనేక నగరాల్లో దొంగతనాలు చేశారు. ఇందులో ఇందిరాగాంధీ గారి ఎపిసోడ్ కూడా వుంది. అది ఏమిటనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఈ కథ కోసం దర్శకుడు దాదాపు మూడేళ్ళు పాటు రీసెర్చ్ చేశారు.


అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది?
అభిషేక్ అగర్వాల్ గారు డేరింగ్ ప్రొడ్యుసర్. ఎక్కడా రాజీపడకుండా చాలా భారీగా ఈ సినిమాని నిర్మించారు. అలాగే టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 తర్వాత, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు వారికి ఇంకో పాన్ ఇండియా హిట్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకం వుంది.


టైగర్ నాగేశ్వరరావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ?
టైగర్ నాగేశ్వరరావు అన్ ప్రెడిక్ట్ బుల్,  స్ట్రాంగ్, అండ్ డైనమిక్. ఎవరూ ఊహించిన హై ఎనర్జీ, యాక్షన్ సీక్వెన్స్ లు వుంటాయి. ఇప్పటివరకూ చూడని యాక్షన్ సీక్వెన్స్ లు ఇందులో వుంటాయి.    


తెలుగు ఇండస్ట్రీ ఎలా అనిపించింది
తెలుగు ఇండస్ట్రీ అద్భుతం. తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు గౌరవిస్తారు. కళకు చాలా ప్రాధాన్యత, గౌరవం వుంది. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ టీం కు ఆస్కార్ వచ్చినప్పుడు చాలా గర్వపడ్డాను. ఇంతగొప్ప పరిశ్రమ లో  భాగం కావడం చాలా ఆనందంగా వుంది.


తెలుగులో మీ ఫేవరేట్ హీరో ?
రామ్ చరణ్ గారు. ఆర్ఆర్ఆర్ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను.


తెలుగులో కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేస్తారు.  


ఆల్ ది బెస్ట్
థాంక్స్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !