View

ఇంటర్య్వూ - హీరో దినేష్ తేజ్ (అలా నిన్ను చేరి)

Thursday,November09th,2023, 03:53 PM

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు  హీరో హీరోయిన్లుగా రాబోతున్న  ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ ‘అలా నిన్ను చేరి’. ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ క్రమంలో హీరో దినేష్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.


 *అలా నిన్ను చేరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? ఎలాంటి ఫీలింగ్ ఉంది?* అలా నిన్ను చేరి అంటూ కొత్తగా ప్రయత్నించాను. కమర్షియల్ ‌రోల్‌ను పోషించాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ప్రతీ ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎదురయ్యే సంఘర్షణే ఇందులో ఉంటుంది. ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అన్నది చూపిస్తాం. ఆ పాయింటే నాకు ఈ సినిమా చేయడానికి స్పూర్తిని ఇచ్చింది.


 *‘ప్లే బ్యాక్’ తరువాత చాలా గ్యాప్‌తో వస్తున్నట్టున్నారు? ఎలా అనిపిస్తోంది?* కరోనా టైంలో వచ్చిన ప్లే బ్యాక్ వల్ల మంచి పేరు వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. నాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ఓ చిత్రం థియేటర్లోకి వచ్చింది కానీ అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రంతో ఎలాంటి ప్రశంసలు వస్తాయో చూడాలి.


 *ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం కష్టం కదా? మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు?* ఇండస్ట్రీలో అందరికీ కష్టాలుంటాయి. కానీ మన వద్దకు వచ్చే స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. జనాలకు నచ్చే కథల్లో కనిపించాలి. 


 *ఈ పాత్రతో మీ రియల్ లైఫ్‌కు సంబంధం ఉంటుందా?* గణేష్ పాత్రకు సినిమాల్లోకి రావాలని ఎంత ప్యాషన్ ఉంటుందో.. దినేష్‌కి కూడా అంతే ఉంటుంది.


 *ఇద్దరు హీరోయిన్లతో కెమిస్ట్రీ ఎలా ఉంది?* హెబ్బా పటేల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె అద్భుతంగా నటించారు. సెట్‌లో ఆమె ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. పాయల్‌ నటన గురించి ఇప్పుడు ప్రేక్షకులు తెలుసుకుంటారు. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.


 *చంద్రబోస్ సాహిత్యం మీ సినిమాకు ఎంత మేరకు ఉపయోగపడింది?* చంద్రబోస్ గారు రాసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. మా సినిమాకు పాటలు రాస్తున్న టైంలోనే ఆయనకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.


 *సుభాష్ ఆనంద్ గారి సంగీతం ఎలా ఉంది?ఆయన గురించి చెప్పండి* సుభాష్ ఆనంద్ గారు ఈ సినిమా తరువాత నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తారు. మా సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించారు.


 *దర్శకుడితో పరిచయం ఎలా ఏర్పడింది?* డైరెక్టర్ మారేష్ శివన్ హుషారు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ మూవీ అయిన ఏడాదికి నా వద్దకు వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వెంటనే ఓకే చెప్పాను.


 *పెద్ద చిత్రాలతో ఎందుకు పోటీ పడుతున్నారు?* జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ వస్తున్నాయని మాకు తెలియదు. అయినా సినిమా బాగుందంటే ఆడియెన్స్ కచ్చితంగా చూస్తారు. మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు. ఈ చిత్రంలో హెబ్బా పాత్రతోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !