View

శృతి ఒక పోరాట యోధురాలు - హన్సిక మోత్వాని

Thursday,November16th,2023, 03:07 PM

దేశ‌ముదురు సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌లో అరంగేట్రం చేసిన హ‌న్సిక అన‌తికాలంలోనే అగ్ర‌క‌థానాయిక‌గా గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె క‌థానాయికగా న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా.. హీరోయిన్ హన్సిక మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


హన్సిక మాట్లాడుతూ.. ‘‘థ్రిల్లర్‌ చిత్రాలను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే తొలిసారి. నా పాత్ర ఇందులో ఓ ట్రాప్‌లో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె తనకు తానుగా బెయిల్ తెచ్చుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శృతి ఒక పోరాట యోధురాలు, ఆమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. దేనికీ వెనకడుగు వేయదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. అలాంటి శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్.


మా అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేసే క్రమంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. తను కూడా ఎక్కడో ఇలాంటి ఘటన జరిగినట్లు చదివానని చెప్పింది. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఫేస్ చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో.. చూస్తున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్ ఇస్తుందీ సినిమా. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్ అవుట్‌పుట్‌తో చూసి చాలా హ్యాపీ. సాంకేతికంగానూ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మార్క్ కె రాబిన్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా ఉంటుంది. ఈ ఫ్యామిలీ, ఫ్రెండ్లీ థ్రిల్లర్ ప్రతి కుటుంబాన్ని కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది.


ప్రస్తుతం తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాను.. అందుకే నా తెలుగు ఫిల్మోగ్రఫీలో కొంత గ్యాప్ వచ్చింది. నా కెరీర్‌ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు. అవకాశాలు ఉన్నా, లేకున్నా.. నేనిప్పుడూ ఇలానే ఉన్నాను. నటన పరంగా మాత్రం నేనింకా సంతృప్తి చెందలేదనే చెబుతాను.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్‌ ప్రారంభంలో అల్లు అర్జున్‌, ప్రభాస్‌తో కలిసి పనిచేసినందుకు నేను గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ.. పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు అర్హమైనదని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ.. ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి.. మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను..’’ అని తెలిపారు.


తారాగణం:
హన్సిక మోత్వాని, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, రాజీవ్ కనకాల తదితరులు నటించిన ఈ చిత్రానికి


ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: జి సుబ్బారావు
పోస్ట‌ర్ డిజైనింగ్‌: విక్ర‌మ్ విజ‌న్స్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్: అమృత బొమ్మి
కాస్ట్యూమ్ ఛీఫ్: స‌ర్వేశ్వ‌ర‌రావు
కో ప్రొడ్యూస‌ర్: ప‌వ‌న్‌కుమార్ బండి
పీఆర్‌వో: మ‌డూరి మ‌ధు,
సినిమాటోగ్రాఫర్: కిశోర్ బోయిడ‌పు
క‌ళా, ద‌ర్శ‌క‌త్వం: గోవింద్
సంగీతం: మార్క్ కె రాబిన్‌
ఎడిటర్: చోటా.కె.ప్రసాద్
నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్
దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !