View

ఇంటర్య్వూ - కింగ్ నాగార్జున (నా సామిరంగ)

Friday,January12th,2024, 03:51 PM

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’.   ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది.  ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున అక్కినేని  విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.


‘నా సామిరంగ’మీ కెరీర్ లో వేగంగా పూర్తి చేసుకున్న సినిమా అనుకోవచ్చా ?
షూటింగ్ డేట్ నుంచి మొదలుపెడితే రిలీజ్ డేట్ కి చిత్రీకరణ వేగంగా జరుపుకున్న సినిమా అనొచ్చు. వర్కింగ్ డేస్ లో మాత్రం కాదు. చాలా సినిమాలు 35రోజుల్లో చేశాం. ‘నా సామిరంగ’ 72 రోజుల చిత్రీకరణ చేశాం. నేను 60 రోజులు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే.. ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యపడుతుంది. ఈ చిత్రానికి చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. కీరవాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వుండటం మా అదృష్టం. మూడు పాటలు షూటింగ్ కి ముందే ఇచ్చేశారు. అలానే ఫైట్ సీక్వెన్స్ కి కూడా నేపధ్య సంగీతం చేశారు. నేపధ్య సంగీతం పెట్టుకొని ఫైట్ షూట్ చేశాం. ఇంత ఫాస్ట్ గా, ఇంత పెద్ద స్కేల్ లో చేశామంటే దానికి కీరవాణి గారు ఒక కారణం. ఇందులో ప్రతి పాట అద్భుతంగా వుంటుంది. మా సినిమాకి కీరవాణి గారే స్టార్.  


‘నా సామిరంగ’ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశాలు ఏమిటి ?
అన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. మంచి స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా హ్యూమన్ ఎమోషన్స్ కూడిన చాలా అద్భుతమైన కథ ఇది.


తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్ధం నేపధ్యాన్ని తీసుకున్నారు కదా ?
భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది.  మనకి సంక్రాంతిపెద్ద పండగ. ఇది 80 నేపధ్యంలో జరిగే కథ. ఇది పండక్కి అందరూ చూడాల్సిన సినిమా.


ఇది మలయాళీ మూలకథ. వారి కథలు, పాత్రలు  స్లోగా మొదలౌతాయి. తెలుగులో వచ్చేసరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
కథ సోల్ మిస్ అవ్వకుండా చేశాం. ఈ విషయంలో దర్శకుడు బిన్నీకి క్రెడిట్ ఇస్తాను. చాలా చక్కగా డిజైన్ చేశాడు. ప్రసన్న తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చక్కగా మార్చాడు.


ఆషికా రంగనాథ్ గురించి ?
ఇందులో చాలా టిపికల్ లవ్ స్టొరీ వుంది. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. ముఫ్ఫై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయమై మాట్లాడకుండానే వాళ్ళ ప్రేమకథ నడుస్తుంది. చాలా డిఫరెంట్ లవ్ స్టొరీ ఇది. ఆషికా చాలా చక్కగా నటించింది.  


దర్శకుడు విజయ్ బిన్నీ గురించి ?
విజయ్ కి చాలా మంచి విజువల్ సెన్స్ వుంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. డ్యాన్స్ లా కాకుండా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో వుంది. అది నాకు చాలా నచ్చింది. ఇది కథ తనకి ఇచ్చి ఎలా చేస్తావని చెప్పమన్నప్పుడు.. తను అనుకున్న పద్దతిలో చెప్పాడు. అది మా అందరికీ నచ్చింది. బిన్నీ చాలా క్లారిటీ వున్న దర్శకుడు.


అల్లరి నరేష్,రాజ్ తరుణ్  పాత్రల గురించి ?
విజయ్ బిన్నీ ప్రాజెక్ట్ లోకి రాకముందే నరేష్ పాత్రని అనుకున్నాం. సోదరభావం వున్న ఆ పాత్రకు నరేష్ కరెక్ట్ గా షూట్ అవుతారనిపించింది. అలాగే రాజ్ తరుణ్ ది కూడా కథలో కీలకమైన పాత్రే.


నా సామిరంగ టైటిల్ గురించి ?
నాన్న గారి పాట నుంచి వచ్చిన టైటిల్ ఇది. మన కథకు బాగా నప్పుతుందనిపించింది. సినిమాలో చాలా చోట్ల ఈ టైటిల్ వినిపిస్తూనే వుంటుంది.


అనుకున్న సమయానికి రెడీ చేయడం సవాల్ గా అనిపించిందా ?
నా కంటే ఎక్కువగా డైరెక్టర్, కెమరా డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ పని చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, ఇలా అన్నీ విభాగాలు మంచి సమన్వయంతో పని చేశాయి.


యాక్షన్  సీక్వెన్స్ లో ఎలా ఉండబోతున్నాయి ?
చాలా మ్యాసీగా వుంటాయి. నా సినిమాల వరకూ నా సామిరంగ వెరీ మ్యాసీ అనే చెప్పాలి.


నిర్మాతల గురించి ?
శ్రీనివాస చిట్టూరి వండర్ ఫుల్ ప్రొడ్యూసర్. మా మధ్య మంచి బాండింగ్ వుంది. ఎక్కడా వెనకడుగు వేయరు. సినిమాకి కావాల్సిన ప్రతిది రాజీపడకుండా సమకూరుస్తారు.


మహేష్ బాబు గారి కలసి సినిమా చేసి, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు లెగసి ని కొనసాగించాలని గతంలో ఓ ట్వీట్ చేశారు కదా .. ఆ సినిమా చర్చలు జరుగుతున్నాయా ?
ఆయన రాజమౌళి గారితో సినిమా పూర్తి చేసిన తర్వాతే దాని గురించి ఆలోచించాలి.(నవ్వుతూ)  


కొత్త సినిమా గురించి ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.


ఆల్ ది బెస్ట్
థాంక్స్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !