View

చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు - హీరో యష్ పూరి

Wednesday,January31st,2024, 03:10 PM

"చెప్పాలని ఉంది", "అలాంటి సిత్రాలు", "శాకుంతలం" వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో యష్ పూరి.


- మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ "హ్యాపీ ఎండింగ్" కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం. సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా..ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కొత్త వేలో కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ వర్క్.. ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ  "హ్యాపీ ఎండింగ్" సినిమాలో చూస్తారు. సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు. చాలా మంది తమ ప్రమోషన్స్ లో బిగినింగ్ మిస్ అవ్వొద్దు, క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు అంటారు. కానీ ఈ సినిమాలో నిజంగానే బిగినింగ్, ఇంటర్వెల్ ఎంత ముఖ్యమో క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. నేను ట్రైలర్ రిలీజ్ రోజే చెప్పాను మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని. టీమ్ అంతా అదే నమ్మకంతో ఉన్నాం.


- మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా "హ్యాపీ ఎండింగ్". శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించాం కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ఉంటే యూఏ సర్టిఫికెట్ రాదు. నేను యు సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నా. యుఏ ఇచ్చారు. సో పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. నాలాంటి న్యూ హీరోకు యంగ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని చెప్పగలను. వాలెంటైన్స్ డే జరిగే వారంలో మా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. లవ్ ను మేము కొత్తగా సెలబ్రేట్ చేస్తున్నాం. పొయెటిక్, అండర్ స్టాండింగ్, స్పిరిచువల్ లవ్ ఉంటుంది. అది థియేటర్స్ లో చూడండి. మనం ఏదైనా విషయాన్ని ఓపెన్ గా చెబితే దాన్ని బోల్డ్ అనొచ్చు. అంతే గానీ అది ఫిజికల్ గా చూపించడం కాదు. శాపం అనేది లేకుంటే ఈ సినిమా కథ ప్రారంభం కాదు. ఒక యువకుడి ఫీలింగ్స్ బయటకు రాకుండా మనసులోనే ఉండిపోతే అతను ఎలా ఉంటాడు అనేది మా సినిమాలో హీరో హర్ష్ క్యారెక్టర్.


-  "హ్యాపీ ఎండింగ్" సినిమాలో పాటలు, కామెడీ బాగా వచ్చాయి. ట్రైలర్ బాగుందని చెబుతున్నారు. అయితే వీటన్నింటినీ కనెక్ట్ చేస్తూ కథలో బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. అదే ఈ సినిమా కథకు అసలైన పాయింట్. శాపం అనేది ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ మాత్రమే. కానీ కథలో చివరగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది ఎమోషన్ కే. శాపం ఉంటుంది కాబట్టి వాడు లవ్ ను ఫిజికల్ గా తన ప్రేయసితో చెప్పడు. వేరే పద్దతుల్లో పొయెటిక్ గా తెలియజేస్తాడు. అన్నీ దినుసులు ఉన్న ధమ్ బిర్యానీ లాంటి సినిమా ఇది.


- సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. వినయంగానే చెబుతున్నాం మా సినిమా సక్సెస్ అవుతుందని. సినిమా ప్రారంభంలోనే శాపాన్ని రివీల్ చేస్తూ ఫస్టాఫ్ సరదాగా విష్ణుతో నేను చేసే కామెడీతో సాగుతుంది. సెకండాఫ్ లో ఎదురయ్యే కొన్ని ఘనటల వల్ల సినిమా ఎమోషనల్ అవుతుంది. నా క్యారెక్టర్ పేరు హర్ష్. కానీ అతని వ్యక్తిత్వం హార్ష్ గా ఉండదు. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. సెన్సార్ అయ్యాక కూడా నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి కొంతమంది సినిమా బాగుందంటూ మాట్లాడారు. సినిమా నచ్చడం వల్లే నాకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.


- "హ్యాపీ ఎండింగ్" సినిమాకు డెమో షూట్ చేశాం.  8 నిమిషాల ఆ షూట్ ఔట్ పుట్ చూశాక కౌశిక్ కు నా మీద నాకు కౌశిక్ మీద మా ఇద్దరి మీదా సిల్లీ మాంక్స్ వాళ్లకు నమ్మకం ఏర్పడింది. మిగతా సినిమాల వాళ్లు ఇలా డెమో షూట్స్ చేస్తారో లేదో తెలియదు గానీ డెమో షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేశాను. సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ లో దాదాపు అంతా కొత్త వాళ్లే. ఈ యంగ్ టీమ్ కు నిర్మాత అనిల్ గారు సపోర్ట్ గా నిలిచి షూట్ కు పంపారు. ఔట్ పుట్ చూశాక ఆయన హ్యాపీగా ఉన్నారు. నేను నాలుగు సినిమాలు చేశాను. నేను హీరోగా చేసిన గత సినిమాలోనూ స్టోరీనే హీరో అనుకుంటా. ఈ సినిమాలోనూ నేను సెకండ్ హీరో. ఫస్ట్ హీరో కథే.


- కమర్షియల్ హీరోగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే వందమంది విలన్స్ ను స్క్రీన్ మీద కొట్టినట్లు చూపిస్తే ఎవరూ నమ్మరు. హీరోగా స్థిరపడిన తర్వాత పక్కా కమర్షియల్ స్టైల్ లో మూవీస్ చేస్తా. త్వరలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !