View

90 నుంచి 66కు తగ్గాను - అవినాష్ మాడేటి

Sunday,September14th,2014, 04:04 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు' చిత్రం ద్వారా వెండితెరకు నటుడిగా పరిచయం అయిన అవినాష్ మాడేటి à°† తర్వాత 'డిస్కో', 'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా  'బూచమ్మ బూచోడు' చిత్రంలో ఘోస్ట్ పాత్ర చేసి శభాష్ అనిపించుకున్నారు అవినాష్. సినిమా హిట్ అవ్వడం, తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన నేపధ్యంలో à°ˆ రోజు (14.9.2014) మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన మనసులోని భావాలను à°ˆ విధంగా పంచుకున్నారు అవినాష్.

బన్నీని రోజూ చూసేవాడిని...

సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే చిత్రరంగంలోకి అడుగుపెట్టాను. పెద్ద క్యారెక్టరా... చిన్న క్యారెక్టరా అని ఆలోచించకుండా నాకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటుడిగా స్థిరపడాలనుకున్నాను. చిత్ర పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకుని ముందుకు దూసుకెళ్లాలంటే నటనతో పాటు డ్యాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయాలి. బిటెక్ ఫైనలియర్ పూర్తి చేయగానే నటనపై దృష్టి సారించాను. 2010లో డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నాను. అక్కడ రోజూ బన్నిని చూసేవాడిని. ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న తను చాలా కష్టపడేవాడు. ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకునేవాడు. ఇదంతా చూసిన నేను... తనే ఇంత కష్టపడుతుంటే, నేనెంత కష్టపడాలి అని ఆలోచించేవాడిని. ఆ స్ఫూర్తితోనే ఫిజిక్ పై దృష్టి సారించాను.

ఆ పట్టుదలతోనే బరువు తగ్గాను...

90కేజీల బరువు ఉండేవాడిని. పట్టుదతో జిమ్ లో చేరాను. బాగా వర్కవుట్లు చేసేవాడిని. 66కేజీలు బరువు తగ్గాను. సిక్స్ ప్యాక్ ని కూడా వర్కవుట్లు చేసి సాధించాను. ఫిజిక్ పరంగా ఫిట్ గా ఉన్నానని అనుకుంటున్న తరుణంలోనే కృష్ణవంశీగారి దర్శకత్వంలో రూపొందిన 'మొగుడు' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

భయపడకుండా చేసాను...

కృష్ణవంశీగారి సినిమాలో అవకాశం అంటే ఏ నటుడికైనా చాలా ఆనందంగా ఉంటుంది. ముందు చాలా సంతోషం వేసింది. కానీ ఆ సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత చాలామంది సీనియర్ ఆర్టిస్ట్ లు సినిమాలో ఉన్నారని అర్థమయ్యింది. అంతమందితో కలిసి నటించాలంటే కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ ఇంట్లో కెమెరా పెట్టుకుని నాకు నేనే నటించడం ప్రాక్టీస్ చేసుకున్నాను. ఈ ప్రాక్టీస్ నాకు బాగా ఉపయోగపడింది. నటించగలననే నమ్మకం ఉంటేనే కదా కృష్ణవంశీగారు ఈ అవకాశం ఇచ్చారు అనుకున్నాను. అంతే... ఎలాంటి టెన్షన్ పడకుండా సినిమా చేసాను. ఈ సినిమా తర్వాత 'డిస్కో' సినిమా చేసాను.

మార్షల్ ఆర్ట్స్ కోసం బ్రేక్ తీసుకున్నాను...

'డిస్కో' సినిమా పూర్తి చేసిన తర్వాత ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావించాను. అందుకే వచ్చిన ఆఫర్స్ ని అంగీకరించకుండా బ్రేక్ తీసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఫిజిక్ పరంగా ఫిట్ అయ్యాను. నా ఫిజిక్ నచ్చి అమెరికన్ క్యాన్సర్ ఇన్సిట్యూట్ కి చెందిన యాడ్ లైఫ్ వారు నన్ను మోడల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది నాకు చాలా పాపులార్టీ తెచ్చి పెట్టింది. ఈ సమయంలోనే 'బూచమ్మ బూచోడు' చిత్రం ఆఫర్ వచ్చింది.

ఘోస్ట్ గా నటించాలనగానే థ్రిల్ ఫీలయ్యాను...

'బూచమ్మ బూచోడు' కథ విన్నాను. కథ బాగా నచ్చింది. ఘోస్ట్ గా నటించాలని డైరెక్టర్ చెప్పగానే ముందు థ్రిల్ ఫీలయ్యాను. వెంటనే చాలా ఘోస్ట్ సినిమాలు చూసాను. డైరెక్టర్ చెప్పింది ఫాలో అయ్యి, ఈ పాత్రలో పూర్తిగా లీనమై నటించాను. పాత్రకు వస్తోన్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. ప్రస్తుతం సైకో గా నటిస్తున్నాను.

నెగటివ్ షేడ్ పాత్రలు చేస్తున్నాను...

ప్రస్తుతం నేను నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేస్తున్నాను. 'హైదరాబాద్ లవ్ స్టోరీ' పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. 'కవిత' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇందులో నేను సైకిక్ నెగటివ్ రోల్ చేస్తున్నాను. రాజమౌళిగారి 'బాహుబలి' చిత్రంలో కూడా విలన్ గ్యాంగ్ వైపు ఉండే పాత్రను చేస్తున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకమైన 'బాహుబలి' చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్న పాత్ర అయినా సరే, నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నాను.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !