View

ఇంటర్య్వూ - హీరో నాగశౌర్య (జాదుగాడు)

Monday,June22nd,2015, 02:20 PM

చందమామ కథలు', 'ఊహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్య', 'లక్ష్మీ రావే మా ఇంటికి' లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ ద్వారా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న హీరో నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం 'జాదుగాడు'. సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'చింతకాయల రవి' ఫేం యోగేష్ దర్శకత్వంలో వి.వి.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన బాలీవుడ్ భామ సోనారికా కథానాయికగా నటించింది. రేపు (26.6.2015) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఫిల్మీబజ్ జరిపిన ఇంటర్య్వూ...


ఫస్ట్ టైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం చేసారు?
అవునండి. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా 'జాదుగాడు' చిత్రం ఉంటుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది. ఈ సినిమా తర్వాత నన్ను యాక్షన్ హీరోగా ప్రేక్షకులు అంగీకరిస్తారనే నమ్మకం ఉంది.


కథ గురించి చెప్పండి?
బ్యాంక్ లో లోన్ రికవరీ ఏజెంట్ గా వర్క్ చేస్తుంటాడు హీరో. హీరోయిన్ తో ప్రేమలో పడిన తరువాత లోకల్ గ్యాంగ్ లీడర్ తో ఏర్పడిన వివాదం హీరో జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది. ఆ వివాదం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేదే ఈ చిత్రం కథ. చాలా ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ యోగేష్.


మీ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
ఈ సినిమాలో నా పాత్ర పేరు కృష్ణ. ఇప్పటిదాకా నేను చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాలోని నా పాత్ర ఉంటుంది. యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్ , లవ్... ఇలా అన్ని కోణాలు ఉన్న పాత్ర నాది. క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఓ వర్గం ప్రేక్షకులకు నేను దగ్గరవ్వలేదనే అసంతృప్తి ఉండేది. ఈ సినిమా ఆ అసంతృప్తిని తుడిచేస్తుంది.


ఈ సినిమా హైలెట్స్ గురించి చెప్పండి?
సినిమా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లయిమ్యాక్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించింది. విజువల్ గా కూడా పాటలు చాలా బాగుంటాయి. సప్తగిరి పాత్ర చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సినిమా ఎక్కడా బోర్ అనిపించదు.


ఫస్ట్ టైమ్ ఫైట్ చేసారు కదా... ఎలా అనిపించింది?
ఫైట్స్ చేయాలంటే కొంచెం భయపడ్డాను. ఆడియన్స్ యాక్సెఫ్ట్ చేస్తారా అని సందేహపడేవాడిని. కానీ డైరెక్టర్ గారి ప్రోత్సహంతో ఫైట్స్ చేసాను. ఎడిట్ చేసిన తర్వాత ఫైట్స్ చూసాను. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం కలిగింది.


ఈ సినిమాలో డ్యాన్సులు బాగా చేసారనే వార్తలు ఉన్నాయి?
నిజం చెప్పాలంటే నాకు డ్యాన్సులు చేయడం పెద్దగా రాదు. కానీ డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, రఘు సహకారంతో ఈ సినిమాలో డ్యాన్స్ లు బాగా చేసాను. ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన తర్వాత నా మీద డైరెక్టర్ కి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయలేదనే ఫీలింగ్ కలిగింది.


డైరెక్టర్ యోగేష్ గురించి చెప్పండి?
'చింతకాయల రవి'లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం చేసిన తర్వాత యోగేష్ గారు చేస్తున్న చిత్రం ఇది. 'చింతకాయల రవి'లో హీరో క్యారెక్టర్ మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంది. స్ర్కిఫ్ట్ మీద చాలా గ్రిఫ్ ఉన్న డైరెక్టర్. తను ఏం చేయాలో, ఎలాంటి సీన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారో ఆయనకు బాగా తెలుసు. ఈ సినిమా ఆయనకు కూడా చాలా మంచి పేరు తెచ్చి పెడుతుంది.


హీరోయిన్ సోనారికా గురించి?
బుల్లితెర పార్వతిగా తను తెలుగు ఆడియన్స్ కి పరిచయమే. ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అవుతోంది. తను పార్వతి రోల్ చేసింది. చక్కగా నటించింది. ఈ సినిమా సోనారికా కెరియర్ కి మంచి మలుపు అవుతుంది.


మీ తదుపరి ప్రాజెక్ట్స్?
నందినిరెడ్డి గారి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఇది కాకుండా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !