View

ఇంటర్య్వూ - హీరో రాహుల్ రవీంద్రన్ (టైగర్)

Tuesday,June23rd,2015, 12:12 PM

స్నేహమా? ప్రేమా? అనడిగితే ఆ కుర్రాడికి ఎటువైపు మొగ్గాలో తెలియదు. ప్రియురాలూ కావాలి... స్నేహితుడూ ముఖ్యమే. రెండు కళ్లులాంటి ఈ ఇద్దరి వల్ల ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'టైగర్'. వారణాసి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ కథానాయికగా నటించింది. హీరో రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర చేసాడు. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో 'ఠాగూర్' మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు (26.6.2015) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ తో ఫిల్మీబజ్ జరిపిన ఇంటర్య్వూ...


'టైగర్' సినిమా కథ గురించి చెప్పండి?
ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఓ అమ్మాయికి మధ్య జరిగే స్టోరీతోనే ఈ చిత్రం రూపొందింది. ఇందులో నా క్యారెక్టర్ పేరు విష్ణు. అన్ని విషయాల్లోనూ చాలా బ్యాలెన్స్ డ్ గా ఉండే విష్ణు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఫ్రెండ్ షిప్ కోసం ఏమైనా చేసే విష్ణుకు స్నేహామా? ప్రేమా? అనే సమస్య ఎదురవుతుంది. అప్పుడు విష్ణు ఏం చేసాడు అనేదే ఈ చిత్ర కథ. ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.


సోలోగా కాకుండా మరో హీరోతో కలిసి సినిమాలు చేస్తున్నారు?
ఈ స్ర్కిఫ్ట్ ప్రకారం విష్ణు పాత్ర హీరో పొజిషన్ లో ఉన్న నటుడు చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే అంగీకరించాను. నేను మంచి సినిమా చేయాలనే ఆలోచనలో ఉంటానే తప్ప... అది సపోర్టింగ్ రోలా... లేదా లీడ్ రోలా అని ఆలోచించను. అలా అని సపోర్టింగ్ రోల్స్ వెంటనే వెంటనే చేయాలని కూడా అనుకోవడంలేదు. స్ర్కిఫ్ట్ డిమాండ్, అందులో హీరో, డైరెక్టర్... అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సపోర్టింగ్స్ రోల్స్ చేస్తాను.


సందీప్ మీకు మంచి ఫ్రెండ్ కదా... అందుకే ఈ సినిమా అవకాశం మిమ్ముల్ని వరించిందా?
సందీప్ నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం గత మూడు సంవత్సరాల నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. డైరెక్టర్ మురుగదాస్ అసిస్టెంట్ ఆనంద్ దగ్గర మంచి కథ ఉంది. ఓసారి విను. నచ్చితే ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని సందీప్ చెప్పాడు. కథ విన్న వెంటనే ఈ సినిమా చేద్దామని చెప్పాను. సందీప్ తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ రోజుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం.


డైరెక్టర్ గురించి చెప్పండి?
తమిళంలో 'అప్పచి గ్రామం' సినిమాకి ఆనంద్ దర్శకత్వం వహించారు. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఇక 'టైగర్' గురించి చెప్పాలంటే చక్కటి స్టోరీ లైన్ తో అద్భుతమైన స్ర్కీన్ ప్లే తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఆనంద్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం మా అందరికీ చాలా మంచి పేరు తెచ్చి పెడుతుంది.


ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు. ఆయనలాంటి సీనియర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ఛోటా.కె.నాయుడులాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలామంది సీనియర్ హీరోల సినిమాలు చేసారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత... నువ్వు చాలా బాగా నటించావు అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి.


మహేష్ బాబు 'శ్రీమంతుడు' చిత్రంలో నటిస్తున్నారు కదా... మీ పాత్ర గురించి చెప్పండి?
'శ్రీమంతుడు'లో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాను. ఈ రోల్ కి నేను అయితే బాగుంటానని డైరెక్టర్ కొరటాల శివ దగ్గర మహేష్ బాబు చెప్పారట. దాంతో నన్ను కాంటాక్ట్ చేసారు. మహేష్ బాబు రిఫర్ చేసారని చెప్పగానే చాలా హ్యాపీ ఫీలయ్యాను. సినిమాలో నా పాత్ర కూడా కీలకం. అందుకే మరో మాట మాట్లాడకుండా ఈ సినిమా అంగీకరించాను.


తమిళ్ చిత్రాలు చేస్తున్నారా?
తెలుగు చిత్రాలకే నా ప్రయార్టీ. 'వెప్పం' డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఇది తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతోంది. ద్విభాషా చిత్రం అనే చెప్పేసరికి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.


దాదాపు పది సినిమాల్లో నటించారు... కెరియర్ ఎలా ఉందనుకుంటున్నారు?
నాకు సినిమాలంటే ఇష్టం. 'అలా ఎలా' చిత్రం సక్సెస్ నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. కెరియర్ బాగుంది. నాకు తెలిసిన ప్రొఫెషన్ ఇదొక్కటే. నాకు ఇష్టమైన ప్రొఫెషన్ కూడా ఇదే. కాబట్టి చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతాను.


తదుపరి ప్రాజెక్ట్స్?
'హైదరాబాద్ లవ్ స్టోరీ' విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఓ చిత్రం చేస్తున్నాను. సోలో హీరోగా రెండు సినిమాలు కమిట్ అయ్యాను. ఒకటి జూలైలో, మరొకటి ఆగస్ట్ లో ఆరంభమవుతాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !