View

రాబోయే నా చిత్రాల్లో ఆ మార్పును చూస్తారు - హీరో నారా రోహిత్

Friday,July24th,2015, 05:03 PM

'బాణం', 'సోలో', 'ప్రతినిధి', 'రౌడీఫెలో', 'అసుర' తదితర చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించిన నారా రోహిత్ ప్రస్తుతం 'అప్పట్లో ఒకడుండేవాడు', 'పండగలా వచ్చాడు', 'సావిత్రి' చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా 'వీరుడు' (ప్రేమను గెలిచాడు) అనే ట్యాగ్ లైన్ తో మరో చిత్రం అంగీకరించారు. డిఫరెంట్ కాన్సెఫ్ట్ లతో, తను చేసే ప్రతి చిత్రం ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనే టార్గెట్ తో సినిమాలను ఎంచుకుని ముందుకు సాగుతున్న నారా రోహిత్ పుట్టినరోజు రేపు (25.7.2015). ఈ సందర్భంగా నారా రోహిత్ తో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ ఈ విధంగా...


పుట్టినరోజు శుభాకాంక్షలు రోహిత్ గారు. మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎలా ఫీలవుతున్నారు?
థ్యాంక్స్. నటుడు అవ్వాలన్నది నా కోరిక. అది నెరవేరింది. ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాను. ఇది ఇంకా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా కెరియర్ సాగుతున్నందుకు సంతోషంగా ఉంది.

మాములుగా పుట్టినరోజునాడు ఏవేవో నిర్ణయాలు తీసుకుంటుంటారు... మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?
చాలా గట్టిగా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే వరుసగా సినిమాలు కమిట్ అయ్యాను. ఈ యేడాది మూడు, నాలుగు సినిమాలు నా నుంచి వస్తాయి. సన్నబడాలనే నిర్ణయం కూడా తీసుకున్నాను. నా గత చిత్రాల్లో నేను కొంచెం లావుగా కనిపిస్తున్నాననే కామెంట్ వినిపించింది. అందుకే సన్నబడాలని డిసైడ్ అయ్యాను. ఇందుకోసం కసరత్తులు కూడా మొదలుపెట్టేసాను. రాబోయే సినిమాల్లో ఆ మార్పును మీరు చూస్తారు.

రౌడీ ఫెలో, అసుర సినిమాలు మిమ్ముల్ని కమర్షియల్ హీరోల జాబితాలోకి చేర్చాయి కదా... ఎలా ఫీలవుతున్నారు?
ఈ సినిమాల విజయం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దాంతో పాటు చాలా బాధ్యతను కూడా పెంచేసిన చిత్రాలు ఇవి. డిఫరెంట్ కాన్సెఫ్ట్ లను ట్రై చేస్తూనే, వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్నదే నా టార్గెట్.

హీరోగా నటించడంతో పాటు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు కదా... ఈ రెండు బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడానికి ఎలా ప్లాన్ చేసుకున్నారు?
హీరోగా నటించడం, నిర్మాతగా ఓ సినిమాకి వ్యవహరించడం పూర్తిగా డిఫరెంట్. ఈ రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలననే నమ్మకం ఉంది. నిర్మాతగా, నటుడిగా రెండు వేరు వేరు కోణాల్లో సినిమాని చూసే అవకాశం దక్కుతుంది. కాబట్టి ప్రొడక్షన్ చేయడం కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా బ్యానర్ లో నేను మాత్రమే హీరోగా సినిమాలు చేయాలనుకోవడంలేదు. మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాను.

హీరోగా కెరియర్ ఆరంభించి ఆరేళ్లు అవుతోంది... కెరియర్ ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?
బాగుందనే అనిపిస్తోంది. డిఫరెంట్ సినిమాలు ట్రై చేసాననే శాటిస్ ఫ్యాక్షన్ ఉంది. కాకపోతే తక్కువ సినిమాలు చేసాననే ఫీలింగ్ మాత్రం ఉంది. అలాగే డిఫరెంట్ సినిమాలు చేయాలనే ఆలోచనతో కమర్షియల్ గా ఎంతవరకూ అవి వర్కవుట్ అవుతాయనే విషయంపై దృష్టి సారించలేదు. ఇకముందు చేసే సినిమాల విషయంలో ఖచ్చితంగా ఇలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటాను.

భవిష్యత్తులో మెగాఫోన్ పట్టుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా?
వామ్మె నాకంత సీన్ లేదు (నవ్వుతూ). ఓ కథ వింటే ఎలా ఉంది అనే విషయాన్ని జడ్జ్ చేయగలను. అంతేగానీ... డైరెక్షన్ చేయడం, రాయడం నా వల్ల కాదు. స్ర్కిఫ్ట్ వినేటప్పుడు మాత్రం అంతకంటే ఏదైనా బెటర్ థాట్ వస్తే చెప్తాను. అది కూడా సలహాలు మాత్రమే. బెటర్ మెంట్ కోసమే.

మల్టీస్టారర్ సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా బాలయ్యతో మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన మీకుందనే టాక్ ఉంది?
ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు. దేనికైనా స్ర్కిఫ్ట్ ముఖ్యం. ఇకపోతే మల్టీస్టారర్ సినిమాలంటే నాకు కూడా ఇష్టమే. భవిష్యత్తులో ఎవరితోనైనా కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయాల్సి వస్తే నో అని మాత్రం చెప్పను. స్ర్కిఫ్ట్ ని బట్టి ఖచ్చితంగా చేస్తాను.

మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
'శంకర' పూర్తయిపోయింది. ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాం. 'పండగలా వచ్చాడు' చిత్రాన్ని సెప్టెంబర్ లో, డిసెంబర్ లో 'సావిత్రి' సినిమాని విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. వీటి తర్వాత 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాని విడుదలకు సిద్ధం చేస్తాం. తమిళంలో సూపర్ హిట్ అయిన 'మన్ కరాటే' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాను'' అని చెప్పి ఇంటర్య్వూ ముగించారు నారా రోహిత్.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !