View

'రఫ్'తో నాకు కమర్షియల్ బ్రేక్ ఖాయం: ఆది

Tuesday,November25th,2014, 01:02 AM

'ప్రేమ కావాలి' చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది ఆ తర్వాత 'లవ్లీ'గా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన చిత్రాలు అతనికి లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చాయి. ఇప్పుడు 'రఫ్' ద్వారా తనలోని మాస్ హీరోని ఆవిష్కరించనున్నాడు. యాక్షన్, కామెడీ, లవ్, సెంటిమెంట్... ఇలా అన్ని అంశాల సమాహారంతో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆదితో జరిపిన ఇంటర్య్వూ విశేషాలు ఈ విధంగా...

ముందుగా పెళ్లి పీటలెక్కబోతున్నారు కదా... కంగ్రాట్స్ ఆది. మీ అభిమానుల కోసం పెళ్లి కబుర్లు మాతో పంచుకుంటారా?

à°“ ష్యూర్. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా వుడ్ బి పేరు అరుణ. బిటెక్ పూర్తి చేసింది. మా ఇంట్లో వాళ్లందరికీ అరుణ బాగా నచ్చింది. తనది అందరితో కలిసిపోయే మనస్తత్వం.  à°¡à°¿à°¸à±†à°‚బర్ 13à°¨ మా పెళ్లి హైదరాబాద్ లో జరుగుతుంది. ఇంట్లో వాళ్లందరూ పెళ్లి పనుల్లో మునిగిపోయారు. నేను కూడా 'రఫ్' ప్రమోషనల్ కార్యక్రమాల్లో, పెళ్లి పనులతో బిజీగా ఉన్నాను.

'రఫ్' గురించి చెప్పండి?

'రఫ్' సినిమా మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ సినిమా కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి, ఎగ్జయిటింగ్ గా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. నా వరకూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంతో నాకు కమర్షియల్ గా మంచి బ్రేక్ ఖాయం అనే నమ్మకం ఉంది.

ఇంతగా మిమ్ముల్ని మెప్పించిన ఈ కథలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది?

చాలా బాగుంటుంది. యూత్ ఫుల్ à°—à°¾ ఉంటుంది. ప్రేమించడం తప్పు కాదు... ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం తప్పు అనే కాన్సెఫ్ట్ తో à°ˆ చిత్రం రూపొందింది. ప్రేమ మీద ఒక్కొక్కరికీ ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. అలా ప్రేమ మీద భిన్నాభిప్రాయలు కలిగిన ముగ్గురు వ్యక్తుల  à°®à°§à±à°¯ సాగే à°•à°¥ ఇది. à°ˆ పాయింట్ హెవీగా అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ à°ˆ పాయింట్ ని ఎంటర్ టైన్ మెంట్ వేలో డీల్ చేసారు. స్ర్కీన్ ప్లే అందరికీ నచ్చుతుంది.

ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ హీరోల జాబితాలో చేరారు కదా? దాని గురించి చెప్పండి?

à°ˆ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ. మాములు కుర్రాడు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తే, అంతగా కనెక్ట్ అవ్వదు. అందుకే à°ˆ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎక్స్ ట్రా ఎఫర్ట్ పెట్టాలని భావించాను. అందులో బాగంగా ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాను. సిక్స్ ప్యాక్ అయితే యూత్ అందరికీ కనెక్ట్  à°…వుతుంది కాబట్టి... సిక్స్ ప్యాక్ చేసాను. ఇందుకోసం 8నెలలు కష్టపడ్డాను. à°ˆ చిత్రం ట్రైలర్స్ చూసిన తర్వాత నేను పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని గట్టి నమ్మకం కలిగింది. ఫిజిక్ బిల్డప్ వల్ల యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పవర్ ఫుల్ à°—à°¾ అనిపిస్తాయి.

యాక్షన్ ఎపిసోడ్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ చేసారు కదా? వారి గురించి చెప్పండి?

ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లోనే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సినిమా ఇదే.  à°ˆ యాక్షన్ ఎపిసోడ్స్ ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసారు. అద్భుతంగా కంపోజ్ చేసారు. నా సేఫ్టీని మైండ్ లో పెట్టుకునే పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ని సమకూర్చారు. à°ˆ చిత్రానికి ఫైట్స్ హైలెట్ à°—à°¾ నిలుస్తాయి.

ఈ చిత్ర దర్శకుడు గురించి చెప్పండి?

డైరెక్టర్ సుబ్బారెడ్డి పెద్ద డైరెక్టర్ల దగ్గర అసోసియేట్ గా చేసారు. ఆయన చేసే పని చాలా క్లారిటీగా ఉంటుంది. కథ ఎలా చెప్పారో, అలానే తెరపై చూపించారు. సినిమాని చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేసారు. చాలా కూల్ గా వర్క్ పూర్తి చేస్తారు సుబ్బారెడ్డి. ఈ సినిమా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చి పెడుతుంది.

వరుస విజయాలతో ముందుకుదూసుకెళుతున్న రకుల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది? అమె ఈ సినిమాలో నటించడం ప్రాజెక్ట్ కి హెల్ప్ అవుతుందనుకుంటున్నారా?

ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సినిమా ఓపెనింగ్స్ రాబట్టడానికి రకుల్ ఓ కారణమవుతుంది. ఇప్పటికే రకుల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేసింది. రెండు పాటలకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ సినిమాకి రకుల్ చాలా ప్లస్.

ఈ సినిమాలో శ్రీహరిగారు నటించారు కదా... ఆయన ఈ సినిమాలో నటించారనే విషయం ఎక్కడా ఎక్స్ పోజ్ అవ్వడంలేదు?

అవును. ఆయన చివరి సినిమాగా పబ్లిసిటీ ఇవ్వమని చాలామంది చెప్పినప్పటికీ, మాకు అలా చేయడం ఇష్టం లేదు. అందుకే శ్రీహరిగారి ట్రైలర్స్ కూడా కట్ చేయలేదు. థియేటర్ లో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. రకుల్ బ్రదర్ గా ఆయన అద్భుతమైన క్యారెక్టర్ చేసారు. ఈ సినిమా ఆయనకు పర్ ఫెక్ట్ ఫేర్ వెల్ అవుతుంది.

నిర్మాత గురించి చెప్పండి?

మా నిర్మాత అభిలాష్ మాధవరం సినిమా మీద పేషన్ ఉన్న వ్యక్తి. సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా చాలా రిచ్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం మూడు భారీ సెట్స్ వేయించారు. సెట్స్ ఎందుకు అనలేదు. డైరెక్టర్ ఏం కావాలని అడిగితే అది సమకూర్చారు. ఓ మంచి నిర్మాతకుండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. చిత్ర పరిశ్రమకు అభిలాష్ లాంటి నిర్మాతలు కావాలి.

ప్రస్తుతం మీరు చేస్తున్న 'గరమ్' చిత్రం గురించి చెప్పండి?

à°ˆ సినిమాకి సంబంధించి 20రోజులు షూటింగ్ పూర్తయ్యింది. 'రఫ్' విడుదల తర్వాత  à°“ చిన్నపాటి బ్రేక్ తీసుకుంటాను. పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాను. తర్వాత 'గరమ్' చిత్రంతో బిజీ అయిపోతాను.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !