View

సిస్టర్ క్యారెక్టర్ అందుకే చేసాను - కార్తీక నాయర్

Sunday,November02nd,2014, 12:23 PM

అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా వీడు తేడా ఫేం చిన్నికృష్ణ దర్శకత్వంలో అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన చిత్రం 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. ప్రముఖ నటి రాధ  à°¤à°¨à°¯ కార్తీక నాయర్ à°ˆ చిత్రంలో అల్లరి నరేష్ సోదరిగా నటించింది. ఇందులో కార్తీకది గయ్యాళి పాత్ర. ఆమెకు జతగా హర్షవర్ధన్ రాణె నటించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం నవంబర్ 7à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా à°ˆ రోజు (2.11.2014) మీడియాతో తన పాత్ర గురించి, తన తదుపరి సినిమాల గురించి కార్తీక చెప్పిన విశేషాలు à°ˆ విధంగా...

హాయ్ కార్తీకగారు... చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు... ఎలా ఫీలవుతున్నారు?

చాలా ఆనందంగా ఉందండి. నేను తెలుగు పరిశ్రమకు దూరంగా ఉండాలనుకోను. మంచి కథ, నా పాత్ర బాగుంటే సినిమా చేయడానికి నేనెప్పుడూ రెడీగానే ఉంటాను.

'దమ్ము'లాంటి కమర్షియల్ సినిమా తర్వాత సినిమా చేయకపోవడానికి కారణం?

నేను డబ్బు సంపాదించేయాలనే టార్గెట్ తో హీరోయిన్ అవ్వలేదు. ముందు ఏ సినిమా కమిట్ అవ్వాలన్నా, అమ్మను దృష్టిలో పెట్టుకోవాలి. ఆమె పేరు చెడగొట్టే విధంగా నేను చేసే పాత్రలు ఉండకూడదు. కాబట్టి ముందు కథ, నేను చేయబోయే పాత్ర తెలుసుకుంటాను. ఆ రకంగా కొన్ని కథలు నచ్చక, ఆ ఆఫర్స్ ని అంగీకరించలేదు. తమిళంలో వరుసగా సినిమాలు అంగీకరించడంతో తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది.

హీరోయిన్ à°—à°¾ నటిస్తున్న మీరు à°ˆ చిత్రంలో సిస్టర్ పాత్ర  à°šà±‡à°¸à°¾à°°à± కదా? à°ˆ పాత్ర అంగీకరించడానికి కారణం?

బ్రదర్ ఆండ్ సిస్టర్ సెంటిమెంట్ తో సినిమా అనగానే మరో మాట మాట్లాడకుండా, సారీ అండీ ఈ ప్రాజెక్ట్ నేను చేయలేనని చెప్పాను. కానీ ముందు కథ వినండి... ఆ తర్వాత మీరు సినిమా చేయాలా వద్దా అనే దాని గురించి ఆలోచించండి అని డైరెక్టర్ చిన్నిగారు చెప్పారు. సరేనని కథ విన్నాను. కథ విన్న తర్వాత సిస్టర్ క్యారెక్టర్ కి హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని అర్ధమైపోయింది. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. కథ విన్న తర్వాత ఈ సినిమాకి నో చెప్పడానికి కారణాలు కనిపించలేదు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర. రొటీన్ హీరోయిన్ పాత్రకంటే భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ అంగీకరించాను.

బ్రదర్ ఆఫర్ బొమ్మాళి... టైటిల్ వెరైటీగా ఉంది?

అవునండి. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టైటిలే నా పాత్రకున్న ఇంపార్టెన్స్ ని తెలియజేస్తోంది. గయ్యాళి సిస్టర్ ని. ప్రేక్షకులు మా బ్రదర్, సిస్టర్ క్యారెక్టర్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.

సినిమా అంతా గయ్యాళిగానే కనిపిస్తారా?

ఫస్టాప్ లో టామ్ బోయ్ లా ఉండే నా పాత్ర, సెకండాఫ్ లో ప్రేమ కోసం మారిపోతుంది.

ఈ పాత్ర కోసం యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చేసినట్టున్నారు?

నా క్యారెక్టర్ ఇంట్రడక్షనే ఓ ఫైట్ తో ఆరంభమవుతుంది. చాలా మంచి సీన్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే... ఓ హీరోకి ఉండాల్సిన సీన్స్ ఈ సినిమాలో నాకున్నాయి. అల్లరి నరేష్ గారు సపోర్ట్ చేసారు కాబట్టే, ఇలాంటి సీన్స్ ని వర్కవుట్ చేయగలిగారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాత్రకు సంబంధించి లభించే ప్రశంసలన్నీ నరేష్ గారికి, డైరెక్టర్ చిన్నిగారికే దక్కుతాయి.

లేడీ జేమ్స్ బాండ్ పాట మీపై చిత్రీకరించారు కదా? ఆ పాట గురించి చెప్పండి?

ఈ పాట చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు. నాతో అద్భుతమైన స్టైప్పులేయించారు. చిరంజీవిగారి కాంబినేషన్ లో పాట చేసేటప్పుడు, నాకు కూడా ఆయనకిచ్చిన స్టెప్పులు ఇవ్వమని అమ్మ అడిగేదట. చిరంజీవిగారు కూడా సపోర్ట్ చేసేవారట. ఇద్దరూ పోటాపోటీగా చేసేవారు కాబట్టే హిట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. నన్ను కూడా ఈ సినిమా కోసం నరేష్ గారు అంతే సపోర్ట్ చేసారు. ఒకవేళ ఆయన సపోర్ట్ చేయకపోతే, చిత్రీకరించిన సీన్స్ ని కూడా ఎడిటింగ్ లో కత్తిరించే అవకాశం ఉంది. కానీ అలా జరగలేదు. అది నరేష్ గారి గొప్పతనం.

ప్రస్తుతం ఇది కాకుండా మీరు చేస్తున్న సినిమాలు గురించి  à°šà±†à°ªà±à°ªà°‚à°¡à°¿?

తమిళంలో అరుణ్ విజయ్ తో 'డీల్' చిత్రం చేస్తున్నాను.  à°¯à±à°Ÿà°¿à°µà°¿ ప్రొడక్షన్ నిర్మిస్తున్న 'పోరంబోకు' చిత్రం చేస్తున్నాను. ఇందులో విజయ్ సేతుపతి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. నాది కూడా హీరోలకు సమానమైన పాత్ర. కాబట్టి మూడో హీరో అనే నన్ను ప్రమోట్ చేస్తున్నారు.

తెలుగులో ఇది కాకుండా, వేరే సినిమాలు అంగీకరించలేదా?

à°“ సినిమా చర్చల దశలో ఉంది. కమిట్ అయిన తర్వాత à°† సినిమా గురించి చెబుతాను. 'బ్రదర్ ఆఫర్ బొమ్మాళి' నాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. మంచి అవకాశాలు వస్తే,  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à°¨à± మెప్పించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. నాతో సినిమాలు చేయాలనుకునే వారు ఎవరినీ కాంటాక్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. నాకు మెనేజర్ లేడు. మా అమ్మను కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. తను కథలు వింటుంది.

అలాగే పెద్ద హీరోలతోనే సినిమాలు చేయాలనే నియమాలు పెట్టుకోలేదు. పాత్ర బాగుంటే సినిమా చేయడానికి నేను రెడీ అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు కార్తీక.

 

Actress Karthika interview about Brother of Bommali



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !