View

ఆ వ్యక్తి ఆదర్శంగా ఈ చిత్ర కథ పుట్టింది - దర్శక, నిర్మాత అక్కి విశ్వనాథ రెడ్డి

Monday,July28th,2014, 06:36 PM

''గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తుంది'' అంటున్నారు దర్శక, నిర్మాత అక్కి విశ్వనాథ రెడ్డి. ఆయన స్వీయ దర్శకత్వంలో మూన్ లైట్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'అడవి కాచిన వెన్నెల'. అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ నటీనటులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అక్కి విశ్వనాథ రెడ్డితో జరిపిన ఇంటర్య్వూ ఈ విధంగా...

ముందుగా మీ గురించి చెప్పండి?

కడపలో కలసపాడు గ్రామంలో పుట్టాను. చదువు, వత్తిరీత్యా దేశ, విదేశాలు తిరిగాను. బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాణ్ణి. అలాగే చైనా, కొరియాల్లో కూడా జాబ్ చేశాను. దాంతో భిన్న సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం లభించింది. నాకొచ్చే మంచి ఆలోచనతో కథలు రాసుకునేవాణ్ణి. అలా రాసుకున్నదే 'అడవి కాచిన వెన్నెల' కథ. ఈ కథను వేరే నిర్మాతకి ఇస్తే న్యాయం జరుగుతుందో లేదో అని నేను నిర్మాతగా వ్యవహరించాను. అసలు సినిమా నిర్మాణం ఎలా ఉంటుంది? అనే విషయం తెలుసుకోగలిగాను.

సినిమా మేకింగ్ గురించి మీకున్న అవగాహన?

వాస్తవానికి నాకు సినిమా గురించి ఏమీ తెలియదు. నిర్మాణం గురించి కానీ దర్శకత్వం గురించి కానీ పెద్దగా అవగాహన లేదు. ఓ సినిమాకి దర్శకత్వం ఎలా వహించాలో అవగాహన తెచ్చుకోవడానికి ఇంటర్నెట్ సహాయం తీసుకున్నాను. ఆ అవగాహనతో ఈ సినిమా చేశాను. కథ మీద నమ్మకంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించా. నేను కెమెరా ఇంజినీర్ ని. అందుకని ఈ చిత్రానికి డీఐ, కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను.

అనుకున్న బడ్జెట్ లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగారా?

ఒకే లొకేషన్లో చాలా చాలా తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తీయాలనుకున్నాను. కానీ, నిర్మాణ వ్యయం మూడు కోట్లు దాటింది. కథకు న్యాయం చేయాలంటే ఖర్చుపెట్టక తప్పలేదు. వచ్చిన ప్రతి మంచి ఆలోచనను కథగా మలుచుకుంటానని చెప్పారు కదా..

అసలీ కథ ఆలోచన ఎప్పుడు వచ్చింది?

ఇది ఆలోచన కాదు. మా ఊళ్లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా అల్లుకున్నా. లంకెబిందెలు దొరికితే జీవితం బాగుంటుందని ఓ వ్యక్తి వాటి కోసం ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుని అడవులపాలయ్యాడు. ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఈ కథ తయారు చేశాను. హాయిగా ఉండే వెన్నెల... అడవిలో కాస్తే వృథాయేగా. కథానుసారం ఈ టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ విని కొంతమంది ఇది అదో రకం సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ, ఈ చిత్రం అభ్యంతరకరంగా ఉండదు. కుటుంబసమేతంగా ఆస్వాదించదగ్గ విధంగా ఉంటుంది.

లంకె బిందెలు దొరుకుతాయంటే మీరు నమ్ముతారా?..ఈ చిత్రంలో ఎవరికి దొరుకుతాయి?

ఈ విషయంలో నాకైతే స్వీయానుభవం లేదు. కానీ, ఇల్లు కట్టేటప్పుడు పొలాల్లో లంకె బిందెలు దొరికాయని చెబుతుంటారు కదా.. అలాంటివి విన్నాను. ఇందులో హీరోకి ఓ శక్తి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ర్టీ పై అపారమైన అవగాహన ఉన్న వ్యక్తి. భూమి లోపల మెటల్ ఉందని కనిపెడతాడు. అది ఎలాంటి మెటల్? దాన్ని కనుగొన్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేదే ఈ చిత్రకథ.

గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉందా?

అవును. గ్రాఫిక్స్ నిడివి దాదాపు అరగంట ఉంటుంది. చోళ పాండ్యరాజులు, గండికోట యుద్ధం నాటి పరిస్థితులను గ్రాఫిక్స్ లో చూపించాం. ఆఫ్రికా మైనింగ్, చైనా వాటర్ ఫాల్స్.. ఇలా మరికొన్ని అద్భుతాలను చూపించడానికి గ్రాఫిక్స్ చేయించాం. టేకింగ్ హాలీవుడ్ స్టయిల్ లో ఉంటుంది. కానీ, అచ్చు తెలుగు చిత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రేక్షకులను థ్రిల్ ఫీలయ్యేలా చేస్తుంది.

పాటలు ఎలా ఉంటాయి?

కథానుసారం నాలుగు పాటలున్నాయి. నాలుగు పాటలనూ సిరివెన్నెల రాశారు. సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. మామూలుగా సిరివెన్నెలగారు పాటలు రాయాలంటే కథ మొత్తం వింటారని తెలిసిందే. ఈ కథను ఆయన మెచ్చుకున్నారు. ఆయన రాసిన పాటలన్నీ సందర్భానుసారం సాగుతాయి. పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ చిత్రం విడుదలకు దగ్గరైన నేపథ్యంలో మీ ఫీలింగ్?

చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం చేశాను. వాస్తవానికి మేలో జరిగిన కేన్స్ చలన చిత్రోత్సవాలకు పంపించాలనుకున్నాను. కానీ, కుదరలేదు. నైజాం, వైజాగ్ లో 'దిల్' రాజు విడుదల చేయనున్నారు. మిగతా ఏరియాల్లో ప్రముఖ పంపిణీదారులు విడుదల చేయనున్నారు. ఇక్కడ విడుదలైన రోజునే బెంగళూరు, యు.ఎస్., ఆస్ట్రేలియాలో కూడా విడుదల కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !